Page Loader
VALENTINES DAY 2025: మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మార్చుకోడానికి కొన్ని టిప్స్! 
మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మార్చుకోడానికి కొన్ని టిప్స్!

VALENTINES DAY 2025: మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మార్చుకోడానికి కొన్ని టిప్స్! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాలెంటైన్స్ డేకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. నిజానికి, వారం రోజుల ముందుగానే వాలెంటైన్ వారం ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మీ ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తీకరించేందుకు ఈ ఏడు రోజులను ఇలా ప్లాన్ చేసుకోండి! ఫిబ్రవరి నెల రాగానే యువతలో ఉత్సాహం పెరుగుతుంది. తమ ప్రియమైన వ్యక్తికి ప్రేమను తెలిపేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. కొందరు ఫిబ్రవరి 14న తమ ప్రేమను ప్రతిపాదిస్తారు, మరికొందరు ముందుగా ప్రేమభావాన్ని వ్యక్తపరిచే ప్రయత్నంలో ఉంటారు. ఏది ఏమైనా ఫిబ్రవరి నెల లవర్స్​కి ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.

వివరాలు 

వాలెంటైన్ వారం ప్రత్యేకత 

చాలా మంది ప్రేమికులు ఫిబ్రవరి మొదటివారం నుంచే వాలెంటైన్ వీక్‌ను పాటిస్తారు. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ఈ వారం,ఒక్కో రోజుకు ప్రత్యేకమైన భావాన్ని కలిగి ఉంటుంది. ఫిబ్రవరి 7 - రోజ్ డే ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే ఫిబ్రవరి 9 - చాక్లెట్ డే ఫిబ్రవరి 10 - టెడ్డీ డే ఫిబ్రవరి 11 - ప్రామిస్ డే ఫిబ్రవరి 12 - హగ్ డే ఫిబ్రవరి 13 - కిస్ డే ఫిబ్రవరి 14 - వాలెంటైన్ డే మీ ప్రేమాభిమానాన్ని ఈ వారం మరింత అర్థవంతంగా జరుపుకోవాలంటే,ముందుగా చక్కటి ప్రణాళిక చేసుకోవాలి. ఈ వాలెంటైన్ వారాన్ని మరింత అందంగా జరుపుకోవడానికి కొన్ని చక్కటి సూచనలు మీ కోసం.

వివరాలు 

సేమ్​ టీషర్టులు : 

మీ తొలి వాలెంటైన్ డే అయినా, ప్రతి క్షణం చిరస్థాయిగా గుర్తుండేలా చేయాలి. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, మీ భాగస్వామితో ఒకే రకంటీ-షర్టులు ధరిస్తే, మీ అనుబంధాన్ని మరింత దృడంగా చేసుకోవచ్చు. రెస్టారెంట్‌లో మీకు ఇష్టమైన భోజనం ఆర్డర్ చేసుకుని, ఎదురెదురుగా కూర్చుని మధురమైన క్షణాలను ఆస్వాదించండి. సినిమాకు వెళ్లండి : ఈ వారం ప్రేమికులకు అంకితం! మీ లవర్‌తో కలిసి మంచి సినిమాకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీ భాగస్వామి ఇష్టమైన సినిమాను ఎంచుకుని, ఇద్దరూ కలిసి చూసి ఆ అనుభూతిని ఆనందించండి.

వివరాలు 

పెళ్లైన వారు కూడా : 

ప్రేమ కేవలం ప్రేమికులకే పరిమితం కాదు. పెళ్లైన వారు కూడా తమ జీవిత భాగస్వామికి ఇష్టమైన బహుమతిని అందించి ప్రేమను మరింత బలంగా మార్చుకోవచ్చు. వారికై స్వయంగా వారి ఇష్టమైన భోజనాన్ని తయారు చేసి వడ్డించడం ద్వారా సంతోషాన్ని పంచుకోవచ్చు. సాయంత్రం వేళ బీచ్​లో: చల్లటి సాయంత్రం వేళ మీ ప్రియుడిని లేదా ప్రేయసిని బీచ్‌కు తీసుకెళ్లి మధురమైన సమయాన్ని గడపండి. అలలు తాకే ఒడ్డున నడవడం ద్వారా మరిచిపోలేని అనుభూతిని పొందవచ్చు. బీచ్ దూరంగా ఉంటే, ప్రకృతి ఒడిలో లేదా పార్క్‌లో కలసి నడిచి, ప్రశాంతతను ఆస్వాదించండి.

వివరాలు 

చాక్లెట్లు బహుమతిగా : 

ప్రేమలో ఉన్నవారు, ఇప్పటికే పెళ్లి అయిన జంటలు - మీ భాగస్వామికి ప్రేమ సూచికగా చాక్లెట్లు బహుమతిగా ఇవ్వండి. గతంలోని ఏవైనా చిన్న చిన్న అపార్థాలను మరచిపోయి, నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ వాలెంటైన్ వారాన్ని ఉపయోగించుకోండి. ఈ వాలెంటైన్ వారం మీ ప్రేమను మరింత బలపరచేలా, మీకు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలేలా ప్లాన్ చేసుకోండి!