
Happy Promise Day 2025: ప్రామిస్ డే రోజున మీ భాగస్వామికి ఈ ప్రత్యేక సందేశాలు పంపండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా...రోజ్ డే,ప్రపోజ్ డే, చాకొలేట్ డే, టెడ్డీ డే తరువాత ఫిబ్రవరి 11న ప్రామిస్ డే జరుపుకుంటారు.
రోజాలు, చాకెట్లు, టెడ్డీలు ఇచ్చి అదే ప్రేమ అంటే సరిపోదు. ఆ ప్రేమను జీవితాంతం పంచుతానని, ఎప్పుడూ తోడుగా నిలుస్తానని ఇచ్చే హామీనే నిజమైన ప్రేమ.
ఆ మాటను గౌరవిస్తూ నిలబడినప్పుడే ప్రేమకు అసలైన అర్థం ఉంటుంది.
అందుకే వాలెంటైన్స్ వీక్‌లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు ప్రామిస్ డే.
ఈ రోజున ప్రేమికులు,స్నేహితులు,కుటుంబ సభ్యులు పరస్పరం హామీలు ఇచ్చుకుంటారు.
తాము ఇచ్చిన మాటను నిబద్ధతతో నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు.
జీవితాంతం అంకితభావంతో ఉండాలని సంకల్పిస్తారు. అందువల్లే ప్రామిస్ డేకు విశేషమైన ప్రాధాన్యత ఉంది.
వివరాలు
బాయ్‌ఫ్రెండ్‌కి చెప్పే ప్రామిస్ డే సందేశాలు
ఎల్లప్పుడూ నీ చెయ్యి పట్టుకొని నీ వెంట నడుస్తాను. నీ కష్టసుఖాలకు తోడుగా ఉంటాను. హ్యాపీ ప్రామిస్ డే!
ఈ ప్రపంచంలో నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టనని హామీ ఇస్తున్నాను. నీ జీవితంలోని ప్రతి క్షణంలో నీకు తోడుగా ఉంటాను. హ్యాపీ ప్రామిస్ డే!
ప్రేమ అనేది రెండు హృదయాల అనుబంధం. పరస్పరం నిబద్ధతతో ఉండే రెండు మనసుల స్పందన ప్రేమ. హ్యాపీ ప్రామిస్ డే!
మాటలకంటే కర్మ గొప్పది. నా హృదయంతో చెబుతున్నాను... ఎప్పటికీ నీకు నిజమైన ప్రేమికుడిగా ఉంటాను. హ్యాపీ ప్రామిస్ డే!
నేను నిన్ను నిస్వార్థంగా ప్రేమించాను. ఏదీ ఆశించకుండా నీకు తోడుగా ఉన్నాను. జీవితాంతం అలాగే ఉంటాను. హ్యాపీ ప్రామిస్ డే!
వివరాలు
గర్ల్‌ఫ్రెండ్‌కి చెప్పే ప్రామిస్ డే సందేశాలు
నీ ప్రేమే నన్ను ముందుకు నడిపించే బలం. నువ్వు చూపే ప్రేమ ఎప్పటికీ నాకు కావాలి. ఎప్పుడూ నీతోనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నా. హ్యాపీ ప్రామిస్ డే!
నేను ఎందరో మంది కోసం హామీలు ఇచ్చాను... కానీ నువ్వు నా జీవితంలో ఉన్నావనే నమ్మకంతోనే. నువ్వే నా బలం, నా ప్రపంచం. హ్యాపీ ప్రామిస్ డే!
నా ప్రతి అడుగులో నీ నీడ ఉంటుంది. నా ప్రతి ఆలోచనలో నీ ప్రతిబింబం కనబడుతుంది. నువ్వే నా జీవితం. హ్యాపీ ప్రామిస్ డే!
నా జీవితానికి వెలుగునిచ్చే దీపమువంటివి నువ్వు. నీకంటే నాకు విలువైనది మరేదీ లేదు. జీవితాంతం నీతో ఉంటానని హామీ ఇస్తున్నా. హ్యాపీ ప్రామిస్ డే!
వివరాలు
గర్ల్‌ఫ్రెండ్‌కి చెప్పే ప్రామిస్ డే సందేశాలు
నా ఆనందంలోనూ, నా బాధలోనూ, నువ్వు నా వెంట ఉన్నావు. నాలో ధైర్యం నింపిన నీ ప్రేమకి నీతోనే నా ప్రయాణం సాగుతుందని మాటిస్తున్నా. హ్యాపీ ప్రామిస్ డే!
రోజ్ డే ప్రేమను మొదలుపెట్టి, ప్రపోజ్ డే భావాలను వ్యక్తం చేసి, చాకొలెట్ డే తీయదనం నింపి, టెడ్డీ డే సాఫ్ట్‌గా మార్చిన మన ప్రేమ, ప్రామిస్ డే ద్వారా శాశ్వతమవుతుందని నమ్ముతున్నా. హ్యాపీ ప్రామిస్ డే!
వివరాలు
ప్రామిస్ డే గొప్పతనాన్ని తెలియజేసే సూక్తులు
"ప్రామిస్ చేయడంలో నెమ్మదిగా ఉండే వారు... దాన్ని నిలబెట్టుకోవడంలో విశ్వసనీయంగా ఉంటారు." - జీన్ జాక్వెస్ రొస్సియు
"మీరు నమ్మేదాని కంటే ధైర్యంగా, కనిపించే దాని కంటే బలంగా, ఆలోచించేదాని కంటే తెలివిగా ఉండాలని నాకు మాట ఇవ్వండి." - విన్నీ ది పూ
"మీరు ఈ ప్రపంచంలో అందమైనదాన్ని వెతికినప్పుడు... చివరికి మీరు కూడా అలానే మారతారని నేను హామీ ఇస్తున్నాను." - టైలర్ కెంట్ వైట్
"ప్రామిస్ అనేది భవిష్యత్తును క్రమబద్ధంగా ఉంచడానికి ప్రత్యేకమైన మార్గం. అవి నమ్మదగినవి, సాధ్యమైనవి అయి ఉండాలి." - హన్నా అరెంట్