
నాన్ వెజ్ లో మాత్రమే దొరికే కొల్లాజెన్, వెజ్ తినే వాళ్ళకు ఎలా దొరుకుతుందో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
అందమైన చర్మం కోసం, కీళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం, ఎముకలు బలంగా ఉండడానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ చాలా అవసరం. ఈ కొల్లాజెన్ ప్రోటీన్, జంతుమాంసం లో మాత్రమే ఎక్కువగా లభిస్తుంది.
మరి శాకాహారులకు కొల్లాజెన్ లభించదా అని ఆశ్చర్యపోకండి. పోషకాహార నిపుణులు మైత్రి త్రివేది చెబుతున్న ప్రకారం, శాకాహారులు కూడా కొల్లాజన్ ప్రోటీన్ అందించే లాభాలను పొందవచ్చు.
మొక్కల నుండి వచ్చే ఆహారాల్లో కొల్లాజెన్ ప్రోటీన్:
గోధుమ, బఠాణీలు, సోయా వంటి వాటి నుండి కొల్లాజెన్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ను తయారు చేయవచ్చు. అంటే, ఇక్కడ ఈ పదార్థాల నుండి ప్రత్యక్షంగా కొల్లాజెన్ వస్తుందని కాదు.
కొల్లాజెన్ ఉత్పత్తికి కారణమయ్యే అమైనో ఆమ్లాలు, పైన చెప్పిన ఆహారాల్లో పుష్కలంగా ఉంటాయి.
ఆహారం
కొల్లాజెన్ ఏర్పడడానికి ఏం చేయాలంటే
కూరగాయలు, పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కొల్లాజెన్ ఏర్పడటంలో సాయపడతాయి. అందుకే సిట్రస్ ఫ్రూట్స్, బ్రొకోలీ, పాలకూరను ఆహారంలో చేర్చుకోవాలి.
అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే పప్పులు, గింజలు, విత్తనాలను తినడం మంచిది.
కావాల్సినన్ని నీళ్ళు తాగాలి:
నీళ్ళు సరిగ్గా తాగకపోతే కొల్లాజెన్ ప్రోటీన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. అందుకే చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడి వయసు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. కాబట్టి శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు ఇస్తూ ఉండాలి.
చక్కెర తగ్గించాలి:
ఎక్కువ చక్కెర కారణంగా కొల్లాజెన్ ఉత్పత్తి సరిగ్గా అవదు.
ఒత్తిడి:
తీవ్రమైన ఒత్తిడి కారణంగా కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీని కారణంగా రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడి చర్మానికి హాని జరుగుతుంది.