LOADING...
Motivational: విజయానికి విదుర నీతి..! తప్పకుండా తెలుసుకోండి..!
విజయానికి విదుర నీతి..! తప్పకుండా తెలుసుకోండి..!

Motivational: విజయానికి విదుర నీతి..! తప్పకుండా తెలుసుకోండి..!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదుర నీతి ప్రకారం,సోమరితనం మన విజయానికి ప్రధాన అడ్డంకి. పని వాయిదా వేసుకునే అలవాటు ఉన్నవారు ఎప్పుడూ "రేపు చేస్తాను" లేదా "తర్వాత చేస్తాను" అని సరైన సమయంలో కృషి చేయడం మానేస్తారు దీని వల్ల మన లక్ష్యం చాలా దూరంగా ఉండిపోతుంది.విజయాన్ని పొందాలంటే కష్టపడి పనిచేయడం తప్పనిసరి అని విదురుడు మనకి స్పష్టంగా చెప్పాడు. విదుర నీతి ప్రకారం,ప్రతి వ్యక్తి తన పని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. బాధ్యతలను దేవునిపై వదిలేసి,"దేవుడు నాకు సహాయం చేస్తాడు"అని ఆశిస్తే సరిపోదు. కృషి లేకపోతే విజయం మనకి దూరమే. శ్రమతో పనిచేస్తే,పట్టుదల చూపిస్తే మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. అందుకే, విజయాన్ని కోరుకునేవారు తమ పని పట్ల నమ్మకంతో,పట్టుదలతో కృషి చేయాలి.

వివరాలు 

సాధారణ స్థాయిలో కష్టాన్ని తట్టుకునే వారు మాత్రమే విజయాన్ని అందుకుంటారు

విదుర నీతి ప్రకారం,అధిక ఆశలు కూడా విజయానికి నిరాశగా మారతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు కోరడం అసాధ్యం. మనం ఎంత ఎక్కువ శ్రమ చేస్తామో,అంత మంచి ఫలితాలు మన వెంట వెళతాయి. ఎవరు కష్టపడి పని చేయకుండా సులభమైన విజయాన్ని ఆశిస్తారో,ఆ వ్యక్తులకు ఆర్థిక సమస్యలు, వైఫల్యాలు తప్పవు. అందుకే, అధిక ఆశలతో ఉండకుండా సాధారణ స్థాయిలో కష్టాన్ని తట్టుకునే వారు మాత్రమే విజయాన్ని అందుకుంటారు. విదుర నీతి ప్రకారం, మనం కర్మలను చేయడంలో అంచనాలు పెట్టకూడదు. కర్మ అంటే కేవలం పని చేయడం కాదు, అది సమయానుగుణంగా, సరైన విధంగా చేయడమే ముఖ్యమని విదురుడు సూచించాడు.

వివరాలు 

కష్టపడి పనిచేసిన ప్రతి వ్యక్తికి దేవుడు సహాయం అందిస్తాడు

మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు తప్పవు. అందుకే, కర్మను అర్థంగా గ్రహించి విశ్వాసంతో, బాధ్యతగా చేయడం మన విజయానికి దారితీస్తుంది. విదుర నీతి మన జీవితానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది. సోమరితనాన్ని దూరంగా ఉంచి, పనిపై నమ్మకాన్ని పెంచుకుని, పట్టుదలతో కష్టపడుతూ, అసాధ్యమైన ఆశలు పెట్టకుండా మన ప్రయత్నాలు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే, కష్టపడి పనిచేసిన ప్రతి వ్యక్తికి దేవుడు సహాయం అందిస్తాడు.