LOADING...
Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ప్రతిరోజూ ప్రత్యేక అలంకారం, నైవేద్యం, వస్త్రాలు
ప్రతిరోజూ ప్రత్యేక అలంకారం, నైవేద్యం, వస్త్రాలు

Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ప్రతిరోజూ ప్రత్యేక అలంకారం, నైవేద్యం, వస్త్రాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం నవరాత్రుల ఉత్సవాలకు ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. ఈ సీజన్‌లో సెప్టెంబర్ 22 నుంచి దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు కొనసాగే ఈ శరన్నవరాత్రులలో అమ్మవారు భక్తులకు 11 ప్రత్యేక అలంకారాల్లో దర్శనం ఇస్తారని సమాచారం. ప్రతి సంవత్సరం పది అలంకారాలు జరిగే సంప్రదాయం ఉండగా, ఈ సారి అమ్మవారు 11 రోజుల పాటు 11 విభిన్న అలంకారాలతో దర్శనమిస్తారు. బాలత్రిపుర సుందరి నుంచి రాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

వివరాలు 

అమ్మవారి రూపం,నైవేద్యం,వస్త్రం 

ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక వస్త్రాలు ధరించి, ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు సమర్పిస్తారు. నైవేద్యాలలో అమ్మవారికి తీపి బూంది నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పించనున్నారు. అలాగే అమ్మవారిని రంగు రంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు చేయనున్నారు. ఇక జరగబోయే నవరాత్రుల్లో ఏ రోజు ఏ రూపంలో అమ్మవారు దర్శనమిస్తుందో, నైవేద్యం, వస్త్రాలు వివరాలు ఇలా ఉన్నాయి.. మొదటి రోజు - బాల త్రిపురసుందరి దేవి, నైవేద్యం: తీపి బూంది, శనగలు లేదా పెసరపప్పు పాయసం, వస్త్రం: ఆరెంజ్ రంగు చీర

వివరాలు 

అమ్మవారి రూపం,నైవేద్యం,వస్త్రం 

రెండవ రోజు - గాయత్రీ దేవి, నైవేద్యం: రవ్వకేసరి, పులిహోర, వస్త్రం: నీలం రంగు చీర మూడవ రోజు - అన్నపూర్ణ దేవి, నైవేద్యం: దద్ధోజనం, కట్టె పొంగలి, వస్త్రం: పసుపు రంగు చీర నాల్గవ రోజు - కాత్యాయిని దేవి, నైవేద్యం: బెల్లం అన్నం, అన్నం-ముద్దపప్పు, వస్త్రం: పూర్తి ఎరుపు రంగు చీర ఐదవ రోజు - మహాలక్ష్మీ దేవి, నైవేద్యం: పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది, వస్త్రం: గులాబీ రంగు చీర ఆరవ రోజు - లలితా త్రిపురసుందరి దేవి, నైవేద్యం: పులిహోర, పెసర బూరెలు, వస్త్రం: ఆకుపచ్చ రంగు చీర ఏడవ రోజు- మహాచండీ దేవి, నైవేద్యం: లడ్డు ప్రసాదం, వస్త్రం: ఎరుపు రంగు చీర

వివరాలు 

అమ్మవారి రూపం,నైవేద్యం,వస్త్రం 

ఎనిమిదవ రోజు - సరస్వతి దేవి, నైవేద్యం: పరవణ్ణం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి, వస్త్రం: తెలుపు రంగు చీర తొమ్మిదవ రోజు - దుర్గాదేవి, నైవేద్యం: గారెలు, నిమ్మరసం కలిపిన అల్లంముక్కలు, వస్త్రం: ఎరుపు రంగు చీర పదవ రోజు - మహిషాసురమర్ధిని దేవి, నైవేద్యం: చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం, వస్త్రం: ఎరుపు రంగు చీర పదకొండవ రోజు - రాజరాజేశ్వరి దేవి, నైవేద్యం: పులిహోర, గారెలు, వస్త్రం: ఆకుపచ్చ రంగు చీర