LOADING...
Panjeeri Laddu Preparation: చలికాలంలో శరీరానికి వెచ్చదనం.. అమ్మ చేతి 'పంజీరీ లడ్డూ' స్పెషల్ రెసిపీ విధానం ఇదే!
చలికాలంలో శరీరానికి వెచ్చదనం.. అమ్మ చేతి 'పంజీరీ లడ్డూ' స్పెషల్ రెసిపీ విధానం ఇదే!

Panjeeri Laddu Preparation: చలికాలంలో శరీరానికి వెచ్చదనం.. అమ్మ చేతి 'పంజీరీ లడ్డూ' స్పెషల్ రెసిపీ విధానం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

చలికాలం మొదలవుతుందంటే చాలు వాతావరణ మార్పుల ప్రభావంతో త్వరగా అలసిపోవడం, దగ్గు, జలుబు వంటి సమస్యలు చాలామందిని వేధించడం సహజం. ఇలాంటి సమయంలో శరీరానికి లోపలి నుంచి వెచ్చదనాన్ని, శక్తిని అందించే ఆహారం ఎంతో అవసరం. అచ్చంగా అలాంటి ఆహారమే పంజాబీ సంప్రదాయ వంటకం అయిన 'పంజీరీ లడ్డూ' అని నిపుణులు చెప్పారు. పంజీరీ లడ్డూ కేవలం ఒక తీపి వంటకం మాత్రమే కాదు. తరతరాలుగా పంజాబీ కుటుంబాల్లో చలికాలంలో తప్పనిసరిగా చేసుకునే ఒక అద్భుతమైన 'వింటర్ సూపర్ ఫుడ్‌'. ఇది శరీరానికి వేడి, బలం ఇచ్చే పోషకాహారని వివరించారు.

Details

పంజీరీ అంటే ఏమిటి?

వేయించిన గోధుమ పిండి లేదా పెసర పప్పు పొడిని నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌, సుగంధ ద్రవ్యాలు, బెల్లంతో కలిపి చేసే పోషకాహార మిశ్రమమే పంజీరీ అని తెలిపారు. ఇది చలిని తట్టుకునే శక్తిని ఇవ్వడంతో పాటు, తీపి తినాలనే కోరికను ఆరోగ్యకరమైన విధానంలో తీర్చుతుంది. పంజీరీ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు స్వచ్ఛమైన నెయ్యి - 1 కిలో పచ్చ పెసర పప్పు పొడి - 1 కిలో గోధుమ పిండి - 1 కిలో డ్రై ఫ్రూట్స్‌ - ఒక కప్పు (బాదం, జీడిపప్పు, కొబ్బరి తురుము, తామర గింజలు లేదా మఖానా) బెల్లం తురుము - అర కిలో (తీపి రుచిని బట్టి పెంచుకోవచ్చు)

Details

పంజీరీ లడ్డూ తయారు చేసే విధానం

ముందుగా ఒక పెద్ద కడాయిలో నెయ్యి వేసి తక్కువ మంట మీద పూర్తిగా కరిగించాలి. ఆ తర్వాత అందులో పెసర పప్పు పొడిని వేసి 30 నుంచి 45 నిమిషాల పాటు ఓపికగా దోరగా వేయించాలి. పప్పు రంగు మారి, కమ్మని వాసన వచ్చే వరకు నిరంతరం కలుపుతూ వేయించడం చాలా ముఖ్యం. తరువాత అదే మిశ్రమంలో గోధుమ పిండిని కలిపి మరో 30 నిమిషాల పాటు వేయించాలి. పిండి గోల్డెన్‌ బ్రౌన్‌ రంగులోకి వచ్చే వరకు మంట తగ్గించి కలుపుతూనే ఉండాలి. పిండి బాగా వేగాక పొడి చేసిన మఖానా, ఎండు కొబ్బరి, ఇతర డ్రై ఫ్రూట్స్‌ మిశ్రమాన్ని జతచేసి మరో 10 నుంచి 15 నిమిషాలు వేయించాలి.

Advertisement

Details

ఇలా చేస్తే సరిపోతుంది

అన్ని పదార్థాలు బాగా కలిసిన తర్వాత స్టవ్‌ ఆపేసి, మిశ్రమాన్ని సుమారు 20 నిమిషాలు చల్లార్చాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్న సమయంలోనే బెల్లం తురుము కలపాలి. మిశ్రమం మరీ వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసితే అది కరిగిపోయి లడ్డూల ఆకృతి సరిగ్గా రాదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం బాగా కలిసిన తర్వాత చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే, చలికాలమంతా ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చని న్యూట్రిషనిస్ట్ తెలిపారు.

Advertisement