
మహిళలకు హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనిక్ దగ్గరకు వెళ్లాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళలు తమ సమస్యలపై అజాగ్రత్త వహిస్తారు. ఏదైనా స్త్రీ సంబంధమైన సమస్యల విషయంలో వారు అంత తేలికగా వైద్యుల దగ్గరకు వెళ్లేందుకు ఇష్టపడరు.
భయం, సిగ్గు లాంటి వాటితో సమస్యను బయటికి చెప్పరు. అయితే కొంతమంది మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్టుని సంప్రదించడం మంచింది.
ఒకవేళ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రతరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మహిళల్లో రుతుక్రమం సరిగ్గా రాకపోతే మహిళల ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.
సాధారణంగా మహిళల్లో 24 రోజులకు పీరియడ్స్ వస్తే మళ్లీ 24 రోజులకు ఆ చక్రం కంప్లీట్ అయ్యి పీరియడ్స్ రావాలి. దీన్నే Menstrual Cycle అంటారు.
Details
పొత్తి కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్లను సంప్రదించాలి
అలా కాకుండా 30 రోజులకు ఒకసారి 38 రోజులకు ఒకసారి వస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి.
కొంతమంది మహిళల్లో పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో లైంగిక చర్య తర్వాత నొప్పి కలిగితే అది బహుశా వాపు, ఫ్రైబ్రాయిడ్స్ ఒవేరియన్ సిస్టుల వల్ల కావచ్చు.
ఇది మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇక వైజైనాని ఆరోగ్యకరంగా ఉంచడంలో స్రవాలు సహకరిస్తాయి.
అయితే కొందరిలో రంగు మారి, దుర్వాసనతో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటిటప్పుడు కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.
పై లక్షణాల్లో ఏవి కనిపించినా కూడా మహిళలు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి.