NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Waxing at Home:ఇంట్లోనే పార్లర్ వాక్సింగ్.. మృదువైన చర్మం​ కావాలంటే ఏం చేయాలంటే
    తదుపరి వార్తా కథనం
    Waxing at Home:ఇంట్లోనే పార్లర్ వాక్సింగ్.. మృదువైన చర్మం​ కావాలంటే ఏం చేయాలంటే
    Wax : ఇంట్లోనే పార్లర్ వాక్సింగ్.. మృదువైన చర్మం​ కావాలంటే ఏం చేయాలంటే

    Waxing at Home:ఇంట్లోనే పార్లర్ వాక్సింగ్.. మృదువైన చర్మం​ కావాలంటే ఏం చేయాలంటే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 12, 2023
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వాక్సింగ్ అంటే చాలా మంది మహిళలకు ఆసక్తి ఎక్కువ. శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను వదిలించుకోవడం కోసం చేసే ప్రక్రియనే వాక్సింగ్ అంటారు.

    ఇదే సమయంలో ఇది మీ అందాన్ని సైతం రెట్టింపు చేస్తుంది. అయితే వాక్సింగ్ కావాలంటే పార్లర్​కి వెళ్లాలి, డబ్బులు కూడా ఖర్చు చేయాలని మహిళలు చాలా మంది అనుకుంటుంటారు.

    ఈ క్రమంలోనే అటు డబ్బుని, ఇటు సమయాన్ని ఆదా చేయాలంటే ఇంట్లోనే మీరు వాక్సింగ్ చేసుకోవచ్చు.

    ఫలితంగా ఇది మీకు మృదువైన చర్మాన్ని అందిచడమే కాదు శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగింపునకు ఇది సులభమైన మార్గాల్లో ఒకటి.

    కొంతమంది అవాంఛిత రోమాల తొలగింపు కోసం రేజర్​ ప్రయోగిస్తుంటారు. దాని వల్ల స్కిన్ బ్లాక్​గా మారుతుంది.

    details 

    వాక్సింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఇవే

    ఇక జుట్టును సైతం గట్టిగా మార్చి చిరాకు, చికాకు కలిగిస్తుంది. అందువల్ల ఇంట్లో లభ్యమయ్యే కొన్ని వస్తువులతో పార్లర్ లాంటి వాక్సింగ్ చేసుకోవడమే ఉత్తమం.

    అయితే ఇంట్లోనే వాక్స్ ఎలా తయారుచేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా

    కావాల్సిన పదార్థాలు

    పంచదార - 1 కప్పు

    నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

    నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు

    ఉప్పు - 1 స్పూన్

    సాస్​పాన్​ -1

    గరిటె - 1 చెక్కది

    పింగాణి గిన్నె -1

    ఐస్ క్యూబ్స్- తగినన్ని

    తయారీ విధానం :

    పెద్ద గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసి దానిలో సిరామిక్ గిన్నెను ఉంచండి.ఇది వాక్స్ కోసం తయారు చేసుకునే మైనాన్ని చల్లార్చడంలో ఉపకరిస్తుంది.

    details

    అలాంటి సమయాల్లో వాక్సింగ్ వద్దు : నిపుణులు

    ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిమీద సాస్ పాన్ ఉంచి, దానిలో చక్కెర,నీరు, ఉప్పు,నిమ్మరసం వేసి బాగా కలపండి. అది కాస్త పాకంగా మారాక మంటను తగ్గించి చెక్క గరిటెతో బాగా తిప్పండి. ఈ మిశ్రమం గోధుమరంగులోకి మారాక స్టవ్ ఆపేయండి.

    ఈ మిశ్రమాన్ని వెంటనే పింగాణీ​ గిన్నెలోకి జాగ్రత్తగా బదిలీ చేయండి. మిశ్రమాన్ని మళ్లీ కలపడం స్టార్ట్ చేయండి. ఇది కాస్త చల్లబడి చిక్కగా వాక్స్ చేసుకునేందుకు వీలుగా మారుతుంది. మీకు కోరుకున్న వేడిలోకి వచ్చాక దానిని వాక్స్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు.

    వాక్స్ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మంపై దద్దుర్లు, గాయాలుకు ఆస్కారముంది. చర్మంపై ర్యాష్ ఉన్నప్పుడు, వడదెబ్బకు గురైనప్పుడు వాక్సింగ్ చేసుకోకూడదని నిపుణలు అంటున్నారు.

    details

    ఈ టిప్స్ పాటిస్తూ వ్యాక్సింగ్ చేసుకోవచ్చు

    బికినీ ప్రాంతంలోనూ వాక్స్ వద్దు, అక్కడ చర్మం సున్నితంగా ఉంటుంది. వాక్సింగ్​కు ముందు రెటినోయిడ్ క్రీమ్​లు ఉపయోగించకూడదు.

    ఇంట్లో వాక్సింగ్ సమయంలో కోల్డ్ ప్యాక్స్ ఉపయోగిస్తే నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. వాక్సింగ్ చేసే ముందు మీ చేతులు, కాళ్లు బాగా కడగండి. ఆరిన తర్వాత దీనిని అప్లై చేయవచ్చు.

    అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేశాకే దీన్ని వినియోగించాలి. మీకు సౌకర్యంగానే ఉంటేనే చేతులు, కాళ్లపై వాక్సింగ్ చేసుకోవచ్చు.

    దీన్ని చర్మానికి మర్థన చేసి దానిపై వాక్సింగ్ రేపర్ ఉంచండి. జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా దాన్ని లాగితే రోమాలు తొలగిపోతాయి.

    ఈ టిప్స్ పాటిస్తూ మీరు ఇంట్లోనే వాక్సింగ్ చేసుకోవచ్చు. హాయిగా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చర్మ సంరక్షణ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    చర్మ సంరక్షణ

    హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్ హోలీ
    హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్ హోలీ
    బిడ్డకు జన్మనిచ్చాక చర్మాన్ని, జుట్టును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు టిప్స్ ప్రెగ్నెన్సీ
    చర్మానికి మెరుపును తీసుకురావడం నుండి నల్లమచ్చలను పోగొట్టడం వరకు తులసి చేసే మేలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025