
Mother's Day 2024: ఇంటికి దూరంగా నివిసిస్తున్నారా.. మీ మదర్స్ డేని ఈ విధంగా ప్రత్యేకంగా చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
మదర్స్ డే ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు.ఈసారి ఈ రోజును మే 12న జరుపుకుంటారు.
తల్లి ప్రేమ,త్యాగం,అంకితభావాన్ని అభినందించడానికి మాతృ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభం అయ్యింది.
ఈ ప్రత్యేకమైన రోజున, పిల్లలు తమ తల్లులకు బహుమతులు, చాక్లెట్లు, పువ్వులు ఇవ్వడం ద్వారా తమ ప్రేమను తెలియజేస్తారు.
కానీ ఈ రోజుల్లో పిల్లలు ఉద్యోగం లేక చదువుల వల్ల ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తోంది.
బయట నివసిస్తున్నప్పుడు, వారి జీవితం కూడా చాలా బిజీగా మారుతుంది.
కానీ మీరు మీ తల్లికి దూరంగా ఉంటే, ఈ ప్రత్యేకమైన రోజును ఆమె కోసం ఎలా ప్రత్యేకంగా చేయాలనే విషయంలో కొంతమంది చాలా గందరగోళంగా ఉంటారు.
Details
సర్ ప్రైజ్ గా మూవీ టికెట్
అయితే మదర్స్ డే నాడు మీ తల్లికి దూరంగా ఉంటూ కూడా ఈ రోజును ఎలా ప్రత్యేకంగా చేసుకోవచ్చో ఇక్కడ మేము మీకు తెలియజేస్తాము.
మీరు బయట ఎక్కడో నివిసిస్తున్నట్లైతే మీ అమ్మను కలవడానికి ఇంటి నుండి వెళ్లలేకపోతే,మీరు మీ అమ్మ కోసం సర్'ప్రైజ్ గా సినిమా టిక్కెట్‌ను పంపవచ్చు. మీరు ముందుగానే మంచి సినిమా కోసం టిక్కెట్లు బుక్ చేసి,మీ మదర్ కి పంపవచ్చు.
వారికి ఇష్టమైన వాటిని పంపండి
ప్రస్తుతం ఈ-కామర్స్ యాప్‌ల వల్ల అన్నీ సులువుగా మారాయి.మీరు మదర్స్ డేని ప్రత్యేకంగా చేయాలనుకుంటే,మీరు ఆమెకు ఇష్టమైన వస్తువును బహుమతిగా ఇవ్వవచ్చు.
Details
లేఖ రాయండి
అది ఆభరణాలు లేదా మేకప్ బాక్స్ కూడా కావచ్చు.మీ అమ్మ కూడా ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్‌తో ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.
ఈరోజుల్లో ఉత్తరాలు రాయడం కాస్త పాతబడినట్లు అనిపించవచ్చు. కానీ మీరు మదర్స్ డే రోజున మీ అమ్మకి ప్రత్యేక అనుభూతిని కలిగించాలనుకుంటే, ఆమెకు ఒక లేఖ రాయండి.
అమ్మ ఈ ఆలోచనను చాలా ఇష్టపడుతుంది. మీ భావాలను ఒక లేఖలో వ్రాసి మీ అమ్మకి పంపండి.