NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / అక్వేరియంలో చేపలను పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి.
    తదుపరి వార్తా కథనం
    అక్వేరియంలో చేపలను పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి.
    చేపలను పెంచేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    అక్వేరియంలో చేపలను పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి.

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 16, 2023
    03:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కుక్కలు, పిల్లులను పెంచడం కంటే చేపలను పెంచడం చాలా సులభం. చేపలను ఆడించడం, బయటకు తీసుకెళ్లడం లాంటివి ఉండవు కాబట్టి చాలా ఈజీగా పెంచవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.

    సహజ సిద్ధమైన వాతావరణాన్ని సృష్టించండి

    మీరు పెంచే చేపల సైజును బట్టి ఎక్వేరియం ట్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ట్యాంకును సూర్యకిరణాలు డైరెక్టుగా పడేచోట ఉంచకూడదు. దానివల్ల అక్వేరియంలో నాచు పెరిగే అవకాశం ఉంటుంది.

    గులకరాళ్లను, ఇసుకను ఎక్వేరియంలో ఉంచితే బాగుంటుంది. అలాగే చేపలు దాక్కొని ఉండడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎక్వేరియంలో క్రియేట్ చేయాలి. ఇంకో విషయం, నీటి పిహెచ్ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.

    పెట్

    చేపకన్ను పరిమాణంలో ఆహారం అందించాలి

    క్లోరిన్ ఎక్కువగా ఉన్న నీటిని ట్యాంక్ లో నింపకూడదు. ఒకవేళ మీరు వాడే వాటర్ లో క్లోరిన్ ఎక్కువగా ఉందని మీకనిపిస్తే, ఆ నీళ్ళని ఎండలో 24గంటల పాటు ఉంచాలి, దానివల్ల క్లోరిన్ తగ్గిపోతుంది.

    నీటిలో పెరిగే చిన్న మొక్కలను అక్వేరియంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కాకుండా నీళ్లలో ఉండే నైట్రేట్ తొలగిపోతుంది. జావా గడ్డి హార్న్ వాట్ గడ్డి మొదలైన చిన్న చిన్న మొక్కలను ట్రై చేయండి.

    అతిగా తినిపించకూడదు

    చేపలకు ఎక్కువ ఆహారం వేయడం వల్ల ట్యాంక్ లో అమోనియా, నైట్రేట్ పెరుగుతుంది. ఇది నాచు పెరగడానికి కారణం అవుతుంది.

    చేప కన్ను ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో మాత్రమే ఆహారం ఇవ్వాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పెట్

    పెట్: పెంపుడు కుక్కను దాని తోక ఊపే విధానం ద్వారా అర్థం చేసుకోండి లైఫ్-స్టైల్
    పెంపుడు కుక్కలను అర్థం చేసుకోవాలంటే వాటి నిద్రపోయే పొజిషన్ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    పెట్: కుందేలు పెంచుకుంటున్నారా? దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో చూడండి లైఫ్-స్టైల్
    పెట్: మీ పెంపుడు పిల్లి మీ దగ్గరకు రావడం లేదా? కారణం తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025