Kalonji Benefits : కలోంజి గింజలతో బరువు, షూగర్ కంట్రోల్ చేయొచ్చు!
కలోంజి గింజలను నల్లజీలకర్ర అని కూడా పిలవచ్చు. చాలా రకాల వంటకాల్లో వీటిని మసాలాగా ఉపయోగిస్తాం. కలోంజి అనేక ఔషదగుణాలకు కలిగి ఉంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులతో పాటు ఉబకాయం వంటి దీర్ఘకాలిక పరిస్థితుల నుండి రక్షించడంలో కలోంజి గింజలు సాయపడతాయి. ఇందులో థైమోక్వినోన్, అనామ్లజనకాలు వల్ల రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతంది. అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంతో కవచంలా ఇవి పనిచేస్తాయి.
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు కలోంజి విత్తనాలు సాయపడతాయి
ఈ చిన్న నల్లని విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కలోంజిని గొప్ప ఔషదమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ విత్తనాలు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు దోహదం చేస్తాయి. వీటిని భోజనంలో చేర్చుకుంటే ఆహారంలో పోషకలు విలువలు పెరుగతాయి. ఈ కలోంజి విత్తనాలను డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కొవ్వును కరిగించడానికి సాయపడతాయి. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గడానికి సహకరిస్తాయి.