NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు
    తదుపరి వార్తా కథనం
    బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు
    పొట్టకొవ్వును కరిగించే పద్దతులు

    బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 30, 2022
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడం అనేది చాలా పెద్ద టాస్క్. దీనికోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా విఫలం అవుతుంటారు.

    ఈ కొవ్వును కరిగించే పద్దతి చలికాలంలో ఇంకా కష్టం. ఎందుకంటే ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో శరీర కదలికలు తక్కువగా ఉంటాయి. దానివల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది.

    ఈ కొవ్వు చాలా ప్రమాదకరమైనది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఐతే ఆయుర్వేదంతో ఈ కొవ్వును కరిగించవచ్చు.

    దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా గోరు వెచ్చని నీటిని పొద్దున్న లేవగానే తాగాలి. దీనివల్ల శరీర కణాల్లో ఉత్తేజం కలుగుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.

    బరువు తగ్గడం

    కొవ్వును కరిగించే మరిన్ని పద్దతులు

    మెంతులు: నానబెట్టిన మెంతులను ఉదయం లేవగానే తినడం వల్ల పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.

    శొంఠి: ఒక చెంచా శోంఠి తీసుకుని మరుగుతున్న నీళ్ళలో వేసి, ఆ నీళ్ళు చల్లారాక తాగాలి. ఇది కొవ్వును కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు జీవక్రియ మెరుగుపడుతుంది.

    యోగా: ఈ మధ్య చాలా మంది యోగా వైపు చూస్తున్నారు. పొద్దున్న లేవగానే కనీసం 40నిమిషాలు సూర్యనమస్కారం, ఇంకా ఇతర కొవ్వును కరిగించే యోగాసనాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

    వేగంగా నడవడం: చాలా సులభంగా కొవ్వును కరిగించుకోవాలనుకుంటే ఇది అత్యుత్తమ మార్గమని చెప్పవచ్చు. ఉదయం లేవగానే ఒక అరగంట సేపు వేగంగా నడవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025