బూడిద గుమ్మడికాయ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు
దిష్టి తీసుకోవాలి అని అనుకోగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది బూడిద గుమ్మడికాయ. ఇది దిష్టి తీసిపడేయడానికి కాదు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు అవేంటో తెలుసుకోండి. అధిక పోషక విలువలతో నిండి ఉంటుంది బూడిద గుమ్మడికాయ. ఇలాంటి ప్రయోజనాలు తెలియని చాలా మంది దానిని కేవలం దిష్టి తీసేందుకు ఉపయోగిస్తున్నారు. బూడిద గుమ్మడికాయ రసంతో తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు వెంటనే మీ డైట్లో కచ్చితంగా భాగం చేసుకుంటారు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియతో పాటు మిమ్మల్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా బూడిద గుమ్మడికాయతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బూడిద గుమ్మడి కాయ తో కొలెస్ట్రాల్ తగ్గుతుంది
హెడ్రేట్ చేస్తుంది: బూడిద గుమ్మడిలో 96 శాతం నీరు ఉంటుంది. దింతో తయారు చేసిన రసం తాగితే హెడ్రేట్గా ఉండటమే కాకుండా.. డ్రై స్కిన్, డ్రై హెయిర్తో ఇబ్బంది పడేవారు మంచి ఫలితాలు పొందుతారు. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: బూడిద గుమ్మడి కాయ తో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కావాలంటే మీరు ఒక నెల రోజులు ప్రయత్నం చేసి చూడండి. రిసల్ట్ మీకే తెలుస్తుంది. కొలెస్టరాల్ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును అదుపు చేస్తుంది: బూడిద గుమ్మడి రసంతో రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. విటమిన్ సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి విటమిన్లతో నిండిన ఈ రసం రక్తంలోని చక్కెరను తగ్గించడానికి గొప్ప ఏజెంట్ గా పనిచేస్తుంది.
ఎసిడిటీ, అల్సర్ల నుంచి ఉపశమనం
శ్వాస సమస్యలు: బూడిద గుమ్మడి రసం వల్ల శ్వాసకోశ సమస్యలను దూరం అవుతాయి. శ్వాసకోశ వ్యాధులైన బ్రోన్కైటిస్, ఉబ్బసం వంటి వాటి చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో బూడిద పొట్లకాయ రసాన్ని ఉపయోగిస్తారు. ఖాళీ కడుపుతో తాగితే: బూడిద గుమ్మడి రసాన్ని ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవడమే కాకుండా కడుపులో ఉన్న టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. శరీరంలోని అనవసరమైన పదార్థాలను తొలగించి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఈ రసం పేగు కదలికలను, జీర్ణ ఎంజైమ్‌ల విడుదలను ప్రోత్సాహిస్తుంది. మీలో pH స్థాయిని అదుపులో ఉంచడం వల్ల ఎసిడిటీ, అల్సర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గడానికి బూడిద గుమ్మడి జ్యూస్
బరువు తగ్గేందుకు: బూడిద గుమ్మడికాయ రసంలో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే ఇది ఒక హెల్తీ డ్రింక్ అవుతుంది. కాబట్టి రోజు ఓ గ్లాసు బూడిద గుమ్మడికాయ రసం తాగండి. ఈ రసంలో ఉన్న ఫైబర్ కంటెంట్ మీ మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ చేకూర్చే బూడిద గుమ్మడికాయను ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకున్నప్పుడే దీని ప్రయోజనాలను పూర్తిగా పొందుతారు. అప్పుడే దానిలోని పోషకాలు మీ శరీరానికి అందుతాయి.