
Clapping Benefits : చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా మనం ఇతరుల్ని అభినందించడానికి, ఉత్సహపరచడానికి ఎక్కువగా చప్పట్లు కొడతాం.
అయితే చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రస్తుతం 'లాఫింగ్ థెరపీ' మాదిరిగానే 'క్లాపింగ్ థెరిపీ కూడా ప్రస్తుతం ఫేమస్ అయ్యింది.
మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలను, నరాల చివరలను కలిగి ఉంటాయి.
వాటిని మనం ఉత్తేజపరిస్తే మన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.
ముఖ్యంగా చప్పట్లు కొట్టడం వల్ల ఆందోళనలకు చెక్ పెట్టొచ్చు. ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Details
చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
చప్పట్లు కొట్టడం వల్ల రక్తపోటు స్థాయిలను నియంత్రించడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతంది.
గుండె సమస్యలను తగ్గించడంతో పాటు శ్వాస సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
వారిలో ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారు చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయట.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జుట్టు కణాల పెరుగుదలకు చప్పట్లు ఎంతగానో తోడ్పడతాయట.