హైపో థైరాయిడిజం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: పాటించాల్సిన ఆహార నియమాలు
థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక పనులను నిర్వర్తిస్తుంది. శరీర పెరుగుదలలో, కణాలను రిపేర్ చేయడంలో జీవక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలకం. అయితే థైరాయిడ్ హార్మోన్ కావాల్సిన దానికన్నా తక్కువగా ఉత్పత్తి అయితే హైపోథైరాయిడిజం అంటారు. కావాల్సిన దానికన్నా థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం అంటారు. ప్రస్తుతం హైపో థైరాయిడిజంతో బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ఈ సమస్యతో బాధపడేవారిలో అలసట, వెంట్రుకలు ఊడిపోవడం, బరువు పెరగడం, ఊరికే మూడ్ మారిపోవడం, చల్లదనం అంటే ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపో థైరాయిడిజంతో బాధపడేవారు వైద్యులు సూచించిన మందులు ఖచ్చితంగా వాడాలి. ఇంకా తమ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి.
హైపో థైరాయిడిజంతో బాధపడేవారు పాటించాల్సిన ఆహార నియమాలు
ముఖ్యంగా అయోడిన్, సెలీనియం, జింక్ పోషకాలు శరీరానికి సరిగ్గా అందేలా చూసుకోవాలి. మీరు తినే ఉప్పులో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. శరీరానికి సెలీనియం అందడానికి గుడ్లు, చిక్కుళ్ళు, పప్పులను మీ ఆహారంలో చేర్చుకోవాలి. తినకూడని ఆహారాలు: గ్లూటెన్ ఉన్న ఆహారాలైన గోధుమ, బార్లీ మొదలగు వాటిని తక్కువగా తినాలి. పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ తక్కువగా తినాలి. ఇంకా క్యాబేజీని ముట్టుకోకపోతేనే మంచిది. కొందరు క్యాబేజీ తినవచ్చని చెబుతారు. కాకపోతే తినకపోతేనే మంచిది. ఎందుకంటే ఎవరి శరీరానికి ఎలాంటి సూట్ అవుతుందో వారికే తెలుస్తుంది. సోయా సంబంధిత ఆహారాలను కూడా తీసుకోకూడదని గుర్తుంచుకోండి.