Hydrogen Peroxide Nebulisation: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నెబ్యులైజేషన్ పోస్టుపై విమర్శల జడివాన
ఈ వార్తాకథనం ఏంటి
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
మయోసైటిస్ బారినపడిన సమంత... సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ట్రీట్ మెంట్ గురించి పోస్టులు పెడుతుంటారు.
ఇటీవల ఆమె నెబ్యులైజేషన్ గురించి పోస్టు చేశారు. వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నెబ్యులైజేషన్ లో ఈ మందులు కూడా వాడొచ్చు అంటూ సమంత పేర్కొన్నారు.
వివరాలు
ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది
ఇటీవల సోషల్ మీడియాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ కోసం వాదించి వివాదంలో చిక్కుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌లో,సమంతా వైరల్ ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ప్రత్యామ్నాయ విధానాన్ని సూచించింది.
మందులను ఆశ్రయించే బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో నెబ్యులైజ్ చేయడానికి ప్రయత్నించమని తన అభిమానులను కోరింది.
సాధారణ వైరల్ కోసం మందులు తీసుకునే ముందు, ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించడాన్ని పరిగణించండి" అని సమంత రాశారు.
"హైడ్రోజన్ పెరాక్సైడ్ , స్వేదనజలం మిశ్రమంతో నెబ్యులైజ్ చేయడం ఒక ఎంపిక.
మేజిక్ లాగా పనిచేస్తుంది. అనవసరంగా మాత్రలు వాడడం మానుకోండి" అని ఆమె అన్నారు. దీనికి కొంతమంది నెటిజన్లు ఒకవేళ ఎవరివైనా ప్రాణాలు పోతే బాధ్యత ఎవరు వహిస్తారంటూ సమంతాకు ప్రశ్నల వర్షం కురిపించారు.