
Dasara Jammi Chettu: జమ్మి చెట్టు ప్రాముఖ్యత ఏమిటి? దసరా రోజు ఈ చెట్టును ఎందుకు పూజిస్తారు?
ఈ వార్తాకథనం ఏంటి
హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది.
దసరా చివరి రోజైన విజయదశమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది.
ముఖ్యంగా, ఆ రోజున శమీ వృక్షం (జమ్మి చెట్టు) పూజించడం చాలా శుభకరమని పండితులు చెబుతున్నారు.
కానీ, ఎందుకు ఈ చెట్టుకు పూజ చేయాలి? విజయదశమికి, శమీ వృక్షానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయాలను చాలా తక్కువ మందికి తెలుసు. అవే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
యజ్ఞయాగాల్లో జమ్మి చెట్టు కాడలు
శమీ వృక్షం పాపాలను హరిస్తుందని నమ్మకం ఉంది. మహాభారతంలో పాండవులు శత్రువులను జయించేందుకు శమీ వృక్షం సహకారం పొందారని పండితులు వివరించారు.
శాస్త్రాల ప్రకారం, శమీ వృక్షం సువర్ణ వర్షాన్ని కురిపిస్తుందని చెప్పబడింది. అందుకే విజయదశమి రోజున శమీ వృక్షానికి పూజ చేస్తారు.
ఆ పూజలో జమ్మి చెట్టు ఆకులను ఇంట్లో పూజ స్థలంలో లేదా ధనస్థానంలో ఉంచితే, ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉంది.
పరమశివుని కుమారుడు, సిద్ది ప్రదాత వినాయకుడికి శమీ వృక్షం సమర్పించే ఆచారం కూడా చాలా కాలంగా కొనసాగుతుంది.
అంతేకాకుండా, జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించే అగ్గిని పూర్వం యజ్ఞయాగాల్లో ఉపయోగించేవారని పండితులు చెబుతున్నారు.
వివరాలు
పాండవులు జమ్మి చెట్టులో ఆయుధాలను దాచారు
నేటికీ కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో జమ్మి చెట్టు లోపల అగ్గి దాగి ఉంటుందనే నమ్మకం ఉంది.
అందువల్ల, దేవాలయాల ప్రతిష్ఠ సమయంలో జమ్మి చెట్టు బెరడులను అగ్ని హోమాలకు ఉపయోగిస్తారు.
మహాభారతంలోని పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టులో దాచారు.
అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత, శమీ వృక్షం వద్దకు చేరుకొని ఆయుధాలను తీసుకుని, శత్రువులను జయించి విజయం సాధించారు.
అందుకే శమీ వృక్షానికి విజయదశమి సందర్భంగా అంతటి విశిష్టత ఉంది.