
Yoga Day: ఏ ఆరోగ్య సమస్యకు ఏ ఆసనం వెయ్యాలంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
మహిళలు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఎంతో కొంత ఒత్తిడికి గురవుతారు.ఈ ఒత్తిడిని బయటకు వ్యక్తపరచకుండా లోపలే దాచుకోవడం వల్ల, అవాంఛితమైన భావోద్వేగాలు.. కోపం,దిగులు, చిరాకు.. పెరిగిపోతాయి. దీని ప్రభావంతో శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్, గర్భధారణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ ఒత్తిడిని నియంత్రిస్తే చాలా ఆరోగ్య సమస్యలు దూరం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఉత్తమ మార్గం యోగ అని వారి అభిప్రాయం.మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి ఆరోగ్య సమస్యకు తగిన యోగాసనాలను అనుసరించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఎలాంటి ఆరోగ్య సమస్యకు ఏ యాసనం ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
వివరాలు
గ్రంథుల పనితీరు మెరుగుపడేందుకు...
థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని ఇతర గ్రంథులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇటీవల ఈ గ్రంథికి సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణమేంటంటే.. ఒత్తిడి. అనేకమంది మహిళలు తమ లోపల ఉన్న భావాలను బయటపెట్టకపోవడం వల్ల,ఒత్తిడి పెరిగి థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. ఇది శరీరానికి అనేకమైన దుష్పరిణామాలను కలిగిస్తుంది. ఆకలి మందగించడం,జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటివి. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి విశుద్ధచక్రాసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.ఇంకా,శరీరంలోని పలు గ్రంథుల సమన్వయాన్ని పిట్యూటరీ గ్రంథి నిర్వహిస్తుంది. కానీ ఒత్తిడితో ఈ సమాచార వ్యవస్థ అంతా స్థిరంగా పనిచేయదు. ఫలితంగా శ్వాస వేగంగా మారుతుంది,ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
వివరాలు
ఊబకాయం తగ్గించేందుకు...
ఇది హార్మోన్ల అసమతుల్యతను తీసుకురావడంతోపాటు, రుతు చక్రం తప్పిపోవడం, మధుమేహం, అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. ఈ బాధలన్నింటిని యోగాతో సమర్థంగా తగ్గించవచ్చు. దీనికోసం సూర్యనమస్కారాలు, విపరీతకర్ణి, నౌకాసనం, మత్య్సాసనం, భ్రమరీప్రాణాయామం, అంతర్ముఖ ముద్ర.. వంటివి సాధన చేయాలి. బరువు తగ్గించుకోవాలంటే యోగాలో సూర్యనమస్కారాలు అత్యంత ప్రభావవంతమైనవి. లాగని నిత్యం అధిక సంఖ్యలో సూర్యనమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. అధిక శ్రమతో చేసే పవర్‌యోగా మొదట బాగానే ఉన్న, కొద్దికాలానికి నడుమునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే రోజూ 20 సూర్యనమస్కారాలు మాత్రమే చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సూర్యనమస్కారాల వల్ల శరీరంలోని ప్రతి భాగం చురుకుగా కదలడంతో పాటు, కొవ్వు కరిగిపోతుంది.
వివరాలు
గర్భాశయ సంబంధిత సమస్యల నివారణకు...
అలాగే నౌకాసనం, పాదహస్తాసనం,ఉత్థానుపాదాసనం, శ్రీలింగముద్ర, కపాలభాతి, వీరభద్రాసనం, త్రికోణాసనం, సర్వాంగాసనం.. లాంటి ఆసనాలు వేయచ్చు. అలాగే భస్త్రికా ప్రాణాయామం కూడా సాధన చేయాలి. ఇటీవల పీసీఓడీ, సిస్టులు, నీటి బుడగలు వంటి సమస్యలు ఎక్కువమంది మహిళల్లో కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు వచ్చిన తర్వాత చికిత్సకన్నా, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మేలైన మార్గం. ఉష్ట్రాసనం, భుజంగాసనం, ధనురాసనం, శుప్తగోరక్షాసనం, పక్షిక్రియ, పశ్చిమోత్తనాసనం, హలాసనం, చక్రాసనం, సర్వాంగాసనం, మాతంగి ముద్ర, నాడీశోధన ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం.
వివరాలు
వెన్నెముక సంబంధిత సమస్యలకు...
పరిశ్రమలలో ఎక్కువ మంది ఉద్యోగులు గంటల తరబడి కూర్చునే పని చేయాల్సి వస్తోంది.దీని వల్ల వెన్నెముకపై అధికంగా ఒత్తిడి పడుతుంది. దీంతో నడుము నొప్పి,మెడ నొప్పి వంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. మేరుదండాసనం,మార్జాలాసనం,వ్యాఘ్రాసనం,భుజంగాసనం,పృష్ణ ముద్ర,మేరుదండ ముద్ర. ఒత్తిడితో ప్రారంభమయ్యే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం యోగాలో దాగుంది. ప్రతి శరీర భాగాన్ని ప్రభావితం చేసేలా రూపొందించిన యాసనాలు శరీరాన్నే కాకుండా మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. నిత్యం కొన్ని నిమిషాలపాటు యోగాసనాలు సాధన చేస్తే, చాలా సమస్యలు ముందే నివారించవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మన ఆరోగ్యానికి సేవచేసే యోగాను మన రోజువారీ జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలి.