Winter Foods: శీతాకాలంలో యాక్టివ్‍నెస్ పెంచే 6 రకాల ఆహారాలు ఇవే..
చలికాలంలో ఉదయం సూర్యుడి రాక ఆలస్యంగా మొదలవుతాయి, పగటివేళలు తగ్గిపోతాయి, వాతావరణం చల్లగా మారుతుంది. ఈ ప్రభావం శరీరంపై కనిపిస్తుంది; చలితీవ్రత అధికమవడం వల్ల శరీరం బద్దకంగా అనిపించవచ్చు. శక్తి స్థాయులు తగ్గిపోవడం, యాక్టివ్‌గా ఉండడం కష్టంగా మారడం కూడా సాధారణం. అయితే, సరైన ఆహారంతో ఈ సవాళ్లను సులభంగా అధిగమించవచ్చు. చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలను గురించి తెలుసుకుందాం.
చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు
ఆకుకూరలు: పాలకూర, కేల్ వంటి ఆకుకూరల్లో విటమిన్ బీ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో 'సెరోటిన్' ఉత్పత్తిని పెంచి, మానసిక శాంతిని, శక్తిని కలిగిస్తాయి. ఆకుకూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, చీనీ వంటి పండ్లు విటమిన్ సీ లో అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలపరచటంతో పాటు, సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. శరీరానికి జీర్ణశక్తిని కూడా మెరుగుపరచగలవు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: సాల్మన్,మాకెరెల్ వంటి చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మూడ్‌ను చురుగ్గా ఉంచి, ఆందోళన, డిప్రెషన్ తగ్గించగలవు. వారానికి మూడుసార్లు ఈ చేపలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు
పులియబెట్టిన ఆహారాలు: పెరుగు, కెఫిర్, కిమ్చి వంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ప్రోబయోటిక్ ఆహారాలు శరీరానికి తేలికగా అనిపించేలా చేస్తాయి. చలికాలంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. నట్స్,సీడ్స్: వాల్‌నట్స్, బాదం, గుమ్మడి గింజలు వంటి నట్స్, సీడ్స్ మెగ్నీషియం పుష్కలంగా కలిగి ఉంటాయి. మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. వీటిని స్నాక్స్‌గా తీసుకోవడం శక్తిని, మూడ్‌ను మెరుగుపరుస్తుంది. దుంప కూరగాయలు: బీట్‌రూట్,క్యారెట్,బంగాళదుంపలు లాంటి కూరగాయలు ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి శరీరానికి ఇంధనాన్ని అందించి,రోజంతా చురుగ్గా ఉంచుతాయి. చలికాలంలో ఈ ఆహారాలను చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి, రోగనిరోధక శక్తి మెరుగవుతాయి. ఇదే సమయంలో శీతాకాలంలో ఆరోగ్యకరమైన జీవితానికి దారితీస్తాయి.