చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం.. కానీ కేరళలో భోజన సమయంలో ఏం తాగుతారో తెలుసా
చల్లటి నీరు(COOL WATER) తాగడం అనారోగ్యకరం. కూల్ వాటర్ తాగితే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్లేష్మం గట్టిపడటం, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, దంతాల సున్నితత్వం, గ్యాస్ట్రిక్, జలుబు, మానసిక ఒత్తిడి తదితర సమస్యలు మొదలవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు తాగితే నాసికా శ్లేష్మం మందంగా మారుతుంది. దీంతో శ్వాసకోశం గుండా వెళ్లడం మరింత కష్టంగా మారుతుందని 1978 ట్రస్టెడ్ సోర్స్ అధ్యయనం చెబుతోంది. దీర్ఘకాలికంగానూ చల్లటి నీరు ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని నిపుణులు తేల్చేశారు. భోజనం తర్వాత కూల్ వాటర్ తాగితే ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టమవుతుందని అంటున్నారు.
చైనా, కేరళ సంస్కృతిలోనూ గోరు వెచ్చని నీరే సేవిస్తారు
36°F (4°C) కంటే తక్కువ ఉన్న నీటిని తాగితే శరీరం, దాని అంతర్గత ఉష్ణోగ్రత 98.6°F (37°C)ని నిర్వహించడంలో అవాంతరాలు ఏర్పడతాయి. జలుబు/ఫ్లూకి సంబంధించి చికిత్సలో చల్లటి నీరు తాగితే సమస్య తీవ్రమవుతుంది. మైగ్రేన్‌ను పెంచడంలో చల్లటి నీరు కారకంగా మారుతుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారిని కూల్ వాటర్ మరింత ఇబ్బంది పెడుతుంది. భోజనంతో పాటు చల్లటి నీటిని తాగే అలావాటు ఉంటే అది చివరకు అన్నవాహిక ద్వారా ఆహారాన్ని పంపించే సామర్ధ్యంపై ప్రభావం చూపుతుంది. వేడి ఆహారంతో చల్లటి నీరు సేవించడంతో అసమతుల్యతను ఏర్పరస్తుంది. ఇది సాంప్రదాయ చైనీస్ వైద్యంలోనూ నమ్ముతారట. చైనీస్ సంస్కృతిలో భోజన సమయంలో గోరువెచ్చని నీటిని సేవిస్తారు. కేరళలోని పలు ప్రాంతంల్లోనూ వెచ్చని నీరే తీసుకోవడం విశేషం.