Indian Factory Workers: గార్మెంట్ ఫ్యాక్టరీల్లో తలపై కెమెరాలతో పని చేస్తున్న కార్మికులు.. అసలు కారణం ఏమిటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కొన్ని ఫ్యాక్టరీల్లో కార్మికులు తలపై చిన్న కెమెరాలు పెట్టుకుని పని చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గార్మెంట్ ఫ్యాక్టరీల్లో వరుసగా కూర్చొని కుట్టు పనులు చేస్తున్న కార్మికులు ఇలా కెమెరాలతో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కెమెరాలు ఎందుకు వాడుతున్నారన్నదిపై ఆసక్తికర చర్చ మొదలైంది. కొందరు వినియోగదారుల ప్రకారం, కార్మికుల పనితీరును 'ఫస్ట్ పర్సన్' వీడియోలుగా రికార్డ్ చేసి, ఆ డేటాతో కృత్రిమ మేధస్సు, రోబోలను శిక్షణ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. అంటే చేతి కదలికలు, వస్త్రాల నిర్వహణ వంటి నైపుణ్యాలను యంత్రాలు నేర్చుకునేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నారు.
వివరాలు
ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు
ఇదే సమయంలో ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు తెలియకుండానే తమ స్థానాలను భర్తీ చేసే టెక్నాలజీకి సహకరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం కాలానికి అనుగుణంగా మారుతూ యాజమాన్యంతో కలిసి పనిచేస్తేనే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఇక నైతిక అంశాలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్మికులకు సరైన సమాచారం ఇస్తున్నారా? తగిన పారితోషికం అందిస్తున్నారా? ఒప్పందాల పరిరక్షణ ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ విధానాన్ని దోపిడీగా విమర్శిస్తూ, కార్మికులే తమ స్థానాలను భర్తీ చేసే విధానాన్ని నేర్పిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వ్యవస్థలు, అవుట్‌సోర్సింగ్ విధానాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కార్మికుల తలపై కెమెరాలు వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Two spacetimes, one data value chain
— CyberRobo (@CyberRobooo) April 12, 2026
>India: Workers’ headcams record garment sewing egocentric data flows to AI/robotics companies.
>China: Operators teleoperate humanoid robots in warehouses, sorting packages …validating the system ,collecting real-world training data. pic.twitter.com/uPrTb6nYRR