Budget 2025: బడ్జెట్ బ్రీఫ్‌కేసు ఎరుపు ఉండటానికి కారణమేమిటి? దాని వెనుక దాగివున్న రహస్యమిదే!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కూడా ఆమె చేతిలో ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్ (బడ్జెట్ బండిల్) కనిపిస్తోంది.
అయితే బడ్జెట్ ఫైల్ ఎప్పుడూ ఎరుపు రంగు లో ఉండటానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఆర్థిక మంత్రి ఎరుపు రంగు ఫైల్ లేదా బ్రీఫ్‌కేస్ పట్టుకుని మీడియా ముందు కనిపిస్తారు. దీనిని బడ్జెట్ బండిల్ అని కూడా అంటారు.
ఇది కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కలిగి ఉంటుంది. ఎంతటి ఆర్థిక మంత్రి అయినా, వారు సమర్పించే బడ్జెట్ ఫైల్ ఎరుపు రంగులోనే ఉంటుందనే సంప్రదాయం ఉంది.
Details
ఎరుపు రంగు ప్రాముఖ్యత
చాలామంది ఎరుపు రంగును డేంజర్ లేదా హెచ్చరికకు సూచికగా భావించవచ్చు. కానీ నిజానికి, ఈ రంగుకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది.
మతపరమైన పండుగలు, ఆచారాలలో ఎరుపు రంగానికి ప్రత్యేక స్థానం ఉంది. హిందూ మతంలో శక్తి, పునర్జన్మ, శాశ్వతత్వాన్ని సూచించే రంగు ఇది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తివంతమైన రంగు అని చెప్పొచ్చు.
హిందూ మతంలో ఎరుపు రంగుకు గల ప్రాముఖ్యతను గమనిస్తే:
దేవతల బొట్టు, మహిళలు ధరిస్తున్న బొట్టు ఎరుపు రంగులోనే ఉంటుంది.
దుర్గామాత, లక్ష్మీదేవి, హనుమంతుడికి ఇష్టమైన రంగు కూడా ఎరుపే.
శుభకార్యాలలో, వివాహ వేడుకల్లో కొత్త వధువు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీ
Details
పరిపాలనా శక్తికి, ఆర్థిక స్థిరత్వానికి ఎరుపు రంగు చిహ్నం
ఆర్థిక మంత్రులు ఎరుపు రంగులోని బడ్జెట్ బండిల్‌ను వాడటంలో వెనుక ఉన్న అర్థం ఇదే. ఈ రంగం ప్రభుత్వ పరిపాలన స్థిరత్వానికి, శక్తికి, అధికారానికి ప్రతీకగా ఉంటుంది.
ఎనిమిదోసారి బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్ కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎరుపు రంగు ఫైల్‌ను అందిపుచ్చుకున్నారు.
కొన్ని సందర్భాల్లో, మంత్రులు కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూస్తుంటాము.
అందుకే, కేంద్ర బడ్జెట్ ఫైల్ ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుందన్నది ఒక నమ్మకం మాత్రమే కాదు, పరిపాలనా శక్తికి, ఆర్థిక స్థిరత్వానికి, సంపదకు చిహ్నంగా మారిన వాస్తవమని కూడా చెప్పొచ్చు.