Loading...
Zomato: జొమాటోలో అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై నిషేధం.. అసలు కారణం ఇదే!
జొమాటోలో అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై నిషేధం.. అసలు కారణం ఇదే!

Zomato: జొమాటోలో అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై నిషేధం.. అసలు కారణం ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్న కస్టమర్లకు కీలక అలర్ట్ వచ్చింది. అనలాగ్ చీజ్,అనలాగ్ పనీర్,ఇతర అనలాగ్ డెయిరీ ఉత్పత్తులతో తయారయ్యే వంటకాల విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని కంపెనీ నిర్ణయించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి ఆహారాన్ని విక్రయించే రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే వాటిని జొమాటో నుంచి తొలగించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. అసలు డెయిరీ ఉత్పత్తులకు బదులుగా తక్కువ ఖర్చుతో లభించే ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించి తయారు చేసే ఆహారాన్ని సాధారణంగా 'అనలాగ్ ఫుడ్'గా పేర్కొంటారు. నిజమైన పాలు,చీజ్ వంటి పదార్థాలకు బదులుగా ప్లాంట్ ఆయిల్స్ తదితర ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించడం ఇందులో భాగం. బయటకు చూస్తే అసలు పాలఉత్పత్తుల మాదిరిగానే కనిపించేలా వీటిని తయారు చేస్తారు.

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల నేపథ్యంలో..

మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విస్తృతంగా తనిఖీలు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తనిఖీలు నిర్వహించింది.

ఈ పరిణామాలతో ఆహార భద్రత, నాణ్యత అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో తమ మెనూలో అనలాగ్ డెయిరీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్న వంటకాలను వెంటనే జొమాటో ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది.

భవిష్యత్తులోనూ నిబంధనలను ఉల్లంఘించే రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాటిని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తామని తెలిపింది.

వివరాలు 

కస్టమర్లకు సరైన సమాచారం అందించడమే లక్ష్యం..

జొమాటో తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రెస్టారెంట్ భాగస్వాములకు సోమవారం పంపిన సందేశంలో కీలక విషయాలను వెల్లడించింది.

కస్టమర్లు ఆహారం గురించి సరైన సమాచారంతో ఆర్డర్ చేసే అవకాశం ఉండటం,వారికి సురక్షితమైన ఆహారం అందడం,ఆశించిన నాణ్యతను పొందడం తమ ప్రధాన లక్ష్యాలని కంపెనీ పేర్కొంది.

ఈ ఉద్దేశంతో అనలాగ్ చీజ్,అనలాగ్ పనీర్ లేదా ఇతర అనలాగ్ డెయిరీ ఉత్పత్తులు ఉపయోగించిన ఆహారాన్ని జొమాటోలో లిస్ట్ చేయడం, విక్రయించడంపై జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ఆహార పదార్థాల విషయంలో కస్టమర్లకు మరింత పారదర్శకత కల్పించడంతో పాటు ఫుడ్ క్వాలిటీని మెరుగుపరచడమే ఈ చర్య వెనుక ఉద్దేశమని స్పష్టం చేసింది.

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

రెస్టారెంట్లకు కీలక సూచనలు..

ఇప్పటికే తమ మెనూలో అనలాగ్ చీజ్, అనలాగ్ పనీర్ లేదా ఇతర అనలాగ్ డెయిరీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించిన రెస్టారెంట్లలోని అలాంటి వంటకాలను జొమాటో వెంటనే ప్లాట్‌ఫామ్‌లో నిలిపివేయనుంది.

ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లు తక్షణమే కొన్ని మార్పులు చేసుకోవాలని కంపెనీ సూచించింది.

మొదట సహజమైన డెయిరీ ఉత్పత్తులకు మారాలని జొమాటో స్పష్టం చేసింది.

అది వెంటనే సాధ్యం కాని పరిస్థితుల్లో అనలాగ్ డెయిరీ ఉత్పత్తులు ఉపయోగించే వంటకాలను మెనూ నుంచి తొలగించాలని సూచించింది.

అంతేకాకుండా రెస్టారెంట్లకు సరఫరా చేసే సంస్థలు అందించే ప్రొడక్ట్ లేబుల్స్, ఇన్‌గ్రిడియెంట్ వివరాలను మరోసారి పూర్తిగా పరిశీలించాలని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ఉల్లంఘిస్తే ప్లాట్‌ఫామ్ నుంచి తొలగింపు..

వంటల్లో వాస్తవంగా ఏ పదార్థాలు ఉపయోగిస్తున్నారో రెస్టారెంట్లు నిర్ధారించుకోవాలని జొమాటో సూచించింది.

అదే సమయంలో తమ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ చేసిన ఆహారం గురించి కస్టమర్లకు కచ్చితమైన, సరైన సమాచారం అందేలా చూడాలని స్పష్టం చేసింది.

ఏదైనా రెస్టారెంట్ జొమాటో నిబంధనలను పాటించడం లేదని తేలితే,ఆ సంస్థను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించే హక్కు తమకు ఉందని కంపెనీ స్పష్టం చేసింది.

తమ పాలసీలు, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం అవసరమైన ఇతర చర్యలు కూడా తీసుకునే అధికారం తమకు ఉందని తెలిపింది.

వివరాలు 

కస్టమర్ల ఆరోగ్యమే ప్రాధాన్యం: ఆదిత్య మంగ్లా

అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు డెలివరీ చేయడం వల్ల జొమాటోకు ఏదైనా నష్టం,ఖర్చు లేదా ఇతర వ్యయం ఏర్పడితే.. ఆ మొత్తాన్ని సంబంధిత రెస్టారెంట్ నుంచి తిరిగి వసూలు చేసే హక్కు కూడా తమకు ఉంటుందని కంపెనీ తన సందేశంలో పేర్కొంది.

ఎక్కువ మంది కస్టమర్లకు మెరుగైన ఆహారాన్ని అందించడమే జొమాటో ప్రధాన లక్ష్యమని కంపెనీ సీఈఓ ఆదిత్య మంగ్లా తెలిపారు.

ఇందులో భాగంగా కస్టమర్ల ఆరోగ్యాన్ని కాపాడటం, రెస్టారెంట్ భాగస్వాములు ఏ రకమైన ఆహారాన్ని లిస్ట్ చేసి విక్రయిస్తున్నారో స్పష్టమైన ప్రమాణాలు పాటించేలా చూడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

వివరాలు 

కస్టమర్ల ఆరోగ్యమే ప్రాధాన్యం: ఆదిత్య మంగ్లా

ఈ కొత్త విధానం ద్వారా ఆ బాధ్యతను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇదే లక్ష్యంతో పనిచేసే రెస్టారెంట్ భాగస్వాములతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మొత్తంగా.. జొమాటోలో ఆహారం ఆర్డర్ చేసే సమయంలో అందులో ఉపయోగించిన పదార్థాల విషయంలో ఇకపై మరింత స్పష్టత ఉండనుంది.

ముఖ్యంగా అనలాగ్ చీజ్, అనలాగ్ పనీర్, ఇతర అనలాగ్ డెయిరీ ఉత్పత్తులను ఉపయోగించే రెస్టారెంట్లపై జొమాటో కఠిన వైఖరి అవలంబించనుంది.

నిబంధనలు పాటించకపోతే ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.

ADVERTISEMENT