Winter Foods : శీతాకాలంలో 8 రకాల సూపర్ ఫుడ్స్ ఇవే
శరీరానికి చలికాలంలో అందించాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి అందిస్తేనే రోగాలను తట్టుకుని నిలబడగలిగే శక్తి అందుకుంటాం. శీతాకాలంలో జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి.ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, సూర్యరశ్మికి కొరత ఉండటం, మరోవైపు చలికి నరాలు కుంచించుకుపోవడం లాంటి వాటితో ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనపడుతుంది. ఫలితంగా శీతాకాలంలో ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం, వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థను రక్షించుకోవడం అవసరం. 1. పసుపు : పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాలుంటాయి.గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపుతో తాగితే జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి. 2. పాలకూర : బచ్చలికూర, పాలకూర తింటే శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణలు అంటున్నారు.
వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లంలో అన్ని ఉన్నాయి
3. సిట్రస్ : నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మ, బత్తాయి పండ్లలో విటమిన్ సి కావాల్సినంత ఉంటుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు తోడ్పడతాయి. 4. అల్లం : వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గొంతు నొప్పి, వికారం తగ్గుదలకు, ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహకరిస్తుంది. 5. వాల్ నట్స్ : ఇవి తినడం వల్ల మెదడు. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచి చేకూరుతుంది. 6. కాలిఫ్లవర్ : చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు గోబిపువ్వు సహకరిస్తుంది. 7. దాల్చిన చెక్క : చలికాలంలో దాల్చినచెక్క అద్భుతంగా పనిచేస్తుంది. 8. చిలగడదుంప, దానిమ్మ : ఈ రెండు కూడా శీతాకాలంలో తీసుకోవడంతో కావాల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు పేర్కొన్నారు.