World cancer day: ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేస్తే గర్భాశయ క్యాన్సర్?
World cancer day: మానవాళిని భయపెడుతున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నారు. ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ డే' కావడంతో గర్భాశయ క్యాన్సర్ గురించిన కొన్ని అనుమానులను నివృత్తి చేసుకుందాం. ఎక్కువ మందితో లైంగిక సంబంధం ఉన్న వారికి మాత్రమే గర్భాశయ క్యాన్సర్ వస్తుందనే అపోహ ప్రచారంలో ఉంది. ఇందులో నిజమెంత? అసలు గర్భాశయ క్యాన్సర్ ఎవరికి వస్తుందో తెలుసుకుందాం.
సెక్స్ వర్కర్లకు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ వస్తుందా?
గర్భాశయ క్యాన్సర్ 'హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (Human papillomavirus)' వల్ల వస్తుంది. హ్యూమన్ పాపిల్లోమావైరస్ అనేది మానవుల నుంచి మానవులకు మాత్రమే సంక్రమించే వైరస్. ఈ వైరస్ లైంగిక భాగస్వామి నుంచి సంక్రమిస్తుంది. ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి వల్ల ఈ వైరస్ సంక్రమించే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, సెక్స్ వర్కర్లు ఈ వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒకరితో మాత్రమే లైంగిక సంబంధం ఉన్నవారికి ఈ వైరస్ సోకుతుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, రెండోది ప్రైవేట్ భాగాల్లో పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ వైరస్‌కు వ్యాప్తికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.