వరల్డ్ చేస్ డే 2023: ఎందుకు జరుపుకుంటారు? దీని వెనక చరిత్ర ఏంటి?
ప్రతీ ఏడాది జులై 20వ తేదీన ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి, చదరంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిని గౌరవించేందుకు ఈరోజును జరుపుతున్నారు. చెస్ పట్ల అవగాహన కల్పించడం, ఆడేందుకు కావలసిన ఏర్పాట్లు మొదలగు అంశాలను వరల్డ్ చెస్ డే రోజున చర్చిస్తారు. వరల్డ్ చెస్ డే ఎప్పటినుండి మొదలైంది? 1996లో ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని జులై 20వ తేదీన జరుపుకోవాలని యునెస్కో నిర్ణయించింది. 1924లో జూలై 20వ తేదీన ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ స్థాపించబడింది. ఆ జ్ఞాపకార్థం జులై 20వ తేదీన ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునెస్కో ప్రకటించింది.
పట్టుదలను, ఆలోచనా తీరును మెరుగుపరిచే చెస్
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ని ఫ్రెంచ్ భాష ప్రకారం FIDE అనే సంక్షిప్త నామంతో పిలుస్తారు. అయితే ప్రస్తుతం FIDE హెడ్ ఆఫీస్ స్విట్జర్లాండ్ లో ఉంది. FIDE అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల చెస్ ఫెడరేషన్లకు అధిపతిగా ఉంటుంది. అంతర్జాతీయ చదరంగ పోటీలను నిర్వహించడంలో FIDE కీలక బాధ్యత వహిస్తుంది. FIDE ని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ 1999లో గుర్తించింది. చెస్ ఆడడం వల్ల ఉపయోగాలు చెస్ ఆడడం వల్ల ఓపిక పెరుగుతుంది, పట్టుదల ఎక్కువవుతుంది. ఆలోచనా తీరు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంతేకాదు జీవితంలో వచ్చే ఛాలెంజేస్ ని ఎలా డీల్ చేయాలో, నిర్ణయాలను ఎలా తీసుకోవాలో చెస్ నేర్పిస్తుంది.