
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం 2023 : ప్రాముఖ్యత, థీమ్ ఎంటో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 26న నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (IFEH) 2011లో ఈ దినోత్సవాన్ని గుర్తించింది.
IFEH- పర్యావరణ ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజలు అన్ని స్థాయిలో తీసుకునే చర్యలను చర్చించేందుకు,అలాగే ఆయా నిర్ణయాలు అమలు చేసేందుకు ఏర్పాటైన ప్రపంచ వేదిక.
మరోవైపు ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ, పర్యావరణ నాణ్యత లేమీని ఎదుర్కొంటున్నాయి.
2023 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య థీమ్:
ప్రతి సంవత్సరం,అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఒక నిర్దిష్ట థీమ్‌తో జరుపుకుంటారు.
ప్రతి రోజూ ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య సంరక్షణలను ఈ సంవత్సరం, IFEH కౌన్సిల్ థీమ్ గా ఎంచుకుంది.
detaills
గత 32 ఏళ్లుగా పర్యావరణ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న IFEH
ప్రాముఖ్యత :- మానవుల శ్రేయస్సు పర్యావరణ ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కనుక పర్యావరణ పరిశుభ్రతను నిర్ధారించి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతులను తెలుసుకునేందుకు అందరికీ పర్యావరణ విద్య అత్యవసరం.
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య చరిత్ర :
పర్యావరణ ఆరోగ్యానికి సంబంధించిన వివిధ సమస్యలపై అవగాహన పెంచేందుకు IFEH ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.
పర్యావరణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు గత 32 ఏళ్లుగా IFEH కృషి చేస్తోంది.మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, ముందుగా మన పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాడం తప్పనిసరి.
పర్యావరణ ఆరోగ్య కోటేషన్స్ :
పర్యావరణాన్ని హానీ కలిగించడానికి అది ఎవరి సొత్తు కాదు.దాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.నాణ్యమైన ఆరోగ్యం కొంటే వచ్చేది కాదు. అది విలువైన పొదుపు ఖాతా వంటిది.