
వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2023: వివిధ రకాల మానసిక అనారోగ్యాలు, వాటి లక్షణాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం ఎంత అవసరమో తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు.
మానసిక అనారోగ్యం ఎవరికైనా కలగవచ్చు. స్త్రీ,పురుషలలో వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటి వారినైనా మానసిక అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి.
ప్రస్తుతం మానసిక అనారోగ్యాల్లోని వివిధ రకాల గురించి తెలుసుకుని, వాటి లక్షణాలు ఏంటో చూద్దాం.
డిప్రెషన్:
డిప్రెషన్ అంటే తీవ్రమైన మనస్తాపం అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య.
ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండడం, రోజువారి పనుల మీద ఆసక్తి తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, నిద్ర సరిగా ఉండకపోవడం, నిరాశ, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి.
Details
యాంగ్జయిటీ
యాంగ్జయిటీ లక్షణాలను చూసుకుంటే అధికంగా ఆందోళన చెందడం, తీవ్రంగా చెమటలు రావడం, ఎప్పుడూ భయం భయంగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు యాంగ్జయిటీలో కనిపిస్తాయి.
బైపోలార్ డిజార్డర్:
ఈ వ్యాధితో బాధపడే వారిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్, నిద్ర లేకపోవడం ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి.
స్క్రిజోఫ్రీనియా:
ఈ వ్యాధితో భాధపడే వారిలో భ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అవతలి వారితో రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేరు.
ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్):
ఈ వ్యాధితో భాధపడే వారిలో ప్రతిసారి చేతులు కడగడం, చేసిన పని మళ్లీ మళ్లీ చేయడం, భయం పుట్టించే ఆలోచనలు రావడం వంటి లక్షణాలు ఉంటాయి.