World organ donation day: శరీరంలోని ఏ అవయవాలను దానం చేయవచ్చో తెలుసుకోండి
అవయవ దానం చేయడం వల్ల అవతలి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల వల్ల అవయవాలు పాడవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొందరికి అవయవాలను మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఆదివారం ప్రపంచ అవయవదాన దినోత్సవం. ప్రతీ ఏడాది ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని జరుపుతున్నారు. అవయవ దానం చేయడంపై అవగాహన, అవయవ దానం ఎందుకు చేయాలి మొదలగు అంశాలపై అన్ని వివరాలను తెలియజేసేందుకు ఈరోజును నిర్వహిస్తారు. చాలామందికి అవయవ దానం చేయడంపై ఆసక్తి ఉంటుంది. కానీ ఏయే అవయవ దానాలు చేయాలో తెలియదు. ప్రస్తుతం ఏయే అవయవాలను దానం చేయవచ్చో తెలుసుకుందాం.
దానం చేయగలిగే అవయవాలు
ఊపిరితిత్తులు (Lungs), కాలేయం (Liver) గుండె (Heart) క్లోమం (Pancreas) మూత్రపిండాలు(Kidney) పైన చెప్పిన ప్రతీ అవయవాన్ని దానం చేయవచ్చు. మరణాంతరం ఈ అవయవాలను ఇతరులకు దానం చేస్తే వారి జీవితం నిలబడుతుంది. అయితే చాలామంది కన్నును కూడా దానం చేయవచ్చు కదా అనుకుంటారు. దానం చేయలేని అవయవాలు: కన్నులోని కార్నియా భాగాన్ని దానం చేయవచ్చు. పూర్తి కన్నును ఒకరి నుండి మరొకరికి అమర్చే అవకాశం లేదు. అలాగే మెదడును మార్చలేము. ఇంకా, ప్రత్యుత్పత్తి అవయవాలను మార్చడం సాధ్యం కాదు. అవయవాలను మార్చడం అంత సులభం కాదు. అవయవాలు అన్నింటిలోకి గుండెను మార్చడం చాలా కష్టం. ట్రాన్స్ ప్లాంటేషన్ లో ఇది చాలా కష్టతరమైనదని చెబుతారు.