
Conjunctivitis: కండ్ల కలక నుండి తొందరగా ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన ఆహారాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఇండియాలో కండ్ల కలక బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాలకు కండ్ల కలక వ్యాపించింది. ఈ నేపథ్యంలో కండ్ల కలక ఇబ్బందులను తగ్గించడానికి ఏయే ఆహారాలు పనికొస్తాయో ఇప్పుడు చూద్దాం.
వెజిటెబుల్ ఆయిల్స్:
కూరగాయల నుండి తీసిన నూనెల్లో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. విటమిన్-ఈ లోని పోషకాలు కండ్ల కలకకు కారణమైన విష పదార్థాలను బయటకు తీసివేస్తాయి.
అలాగే వీట్ జెర్మ్(wheat germ) ఆయిల్ కూడా కండ్ల కలక ఇబ్బందిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ కళ్ళకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.
చియా గింజలు, అవిసె గింజలు:
ఈ రెండు గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కంటి మంటను తగ్గించడంలోనూ, అసౌకర్యాన్ని దూరం చేయడంలోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పనిచేస్తాయి.
Details
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు
ఆకు కూరలు:
కండ్ల కలక అసౌకర్యాన్ని ఆకు కూరలు చాలా వరకు తగ్గిస్తాయి. ఎందుకంటే ఇందులో కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పాలకూర, కాలే వంటి ఆకు కూరల్లో ఆల్ఫా లినోలినిక్ ఆమ్లం ఉంటుంది. దీనివల్ల కండ్ల కలక ఇబ్బందుకు తగ్గుతాయి.
వాల్ నట్స్:
ఈ గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కొన్ని వాల్ నట్స్ ని రాత్రంతా నానబెట్టి తెల్లారక తింటే మంచి ఫలితాలు వస్తాయి.
సాల్మన్ చేప:
సాల్మన్, టూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కండ్లకు కలిగిన ఎలర్జీని దూరం చేస్తాయి.