LOADING...
Motivation: శాంతి, సుఖం కోల్పోవచ్చు..ఈ వ్యక్తులను ఎప్పటికీ శత్రువులుగా మార్చకండి! 
శాంతి, సుఖం కోల్పోవచ్చు..ఈ వ్యక్తులను ఎప్పటికీ శత్రువులుగా మార్చకండి!

Motivation: శాంతి, సుఖం కోల్పోవచ్చు..ఈ వ్యక్తులను ఎప్పటికీ శత్రువులుగా మార్చకండి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజులు, రాజ్యాలు లేకపోయినా అప్పట్లో మహానుభావులు చెప్పిన విషయాలు నేటికీ మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. అలాంటి గొప్పవారిలో ఆచార్య చాణక్యుడు ఒకరు. ఆయన రచించిన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నిండాలంటే కొన్ని నియమాలు పాటించాలని ఆయన బోధించారు. వాటిలో ఒకటి - కొంతమందిని ఎప్పటికీ శత్రువులుగా చేసుకోకూడదు అనే ఉపదేశం. భారతదేశ చరిత్రలో విశిష్ట పండితుడిగా నిలిచిన చాణక్యుడు అధ్యాపకుడు, రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, వక్త, పండితుడు. ఆయన రచించిన 'నీతి శాస్త్రం' నేటికీ యువతకు ప్రేరణ. ముఖ్యంగా జీవితంలో కొంతమందితో శత్రుత్వం పెంచుకోవడం ఖరీదైనదిగా మారుతుందని, అలాంటి వారిని ఎప్పుడూ శత్రువులుగా చేసుకోవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు.

Details

అందరిని సంతోష పెట్టడం కష్టం

మనమందరం అందరినీ సంతోషపెట్టలేము. సహజంగానే కొంతమంది మనకు నచ్చకపోవచ్చు. అలాంటి వారితో దూరం పెడితే అది తర్వాత శత్రుత్వంగా మారిపోతుంది . వేల ఏళ్ల క్రితమే చాణక్యుడు జీవితంలో ఐదు రకాల వ్యక్తులను శత్రువులుగా చేసుకోవద్దని హెచ్చరించారు. లేకపోతే మన శాంతి, సుఖం చెడిపోతుందని ఆయన పేర్కొన్నారు. 1. పొరుగువారు మన ఆనందం, దుఃఖం అన్నింటికీ సాక్షులు మన పొరుగువారే. వారితో సంబంధం చెడిపోతే చిన్న విషయమే పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే పొరుగువారిని ఎప్పుడూ శత్రువులుగా మార్చకూడదు. 2. అత్యంత సన్నిహితులు మన రహస్యాలు, బలహీనతలు సన్నిహితులకు మాత్రమే ఎక్కువగా తెలుస్తాయి. వారితో శత్రుత్వం పెరిగితే అది మనకు అతిపెద్ద ముప్పు కావచ్చు.

Details

 3. కుటుంబ సభ్యులు

కుటుంబంలో అభిప్రాయ భేదాలు సహజం. కానీ వాటిని దూరం చేయకపోతే కుటుంబం లోపలే శత్రుత్వం పెరుగుతుంది. కష్టకాలంలో కుటుంబ మద్దతు లేకపోతే జీవితం ఒత్తిడితో నిండిపోతుంది. అందుకే కుటుంబ సభ్యులను ఎప్పుడూ శత్రువులుగా చేసుకోవద్దని చాణక్యుడు హెచ్చరించారు. 4. ప్రభావవంతమైన వ్యక్తులు ఏ రంగంలోనైనా అధిక ప్రభావం కలిగిన వారితో విభేదాలు పెంచుకోవడం ప్రమాదకరం. వారి సహాయం క్లిష్ట సమయాల్లో సమస్యలను పరిష్కరించగలదు. కాబట్టి వారిని శత్రువులుగా మార్చుకోవడం తప్పు. 5. సహోద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు వృత్తి జీవితాన్ని దెబ్బతీస్తాయి. ఇది ప్రమోషన్లు, ప్రాజెక్టులు, ఇమేజ్‌ వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మొత్తం మీద, చాణక్యుడు చెప్పిన ఈ బోధన నేటికీ అన్వయించుకునేంత ప్రాముఖ్యమైంది.