ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న సమయంలో ఆకలి వేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న సమయంలో కిచెన్ లోంచి వస్తున్న సువాసనలు మీలో తినాలన్న కోరికను పెంచుతున్నాయా? లేదంటే అన్నం తిని చాలా సేపయ్యిందని మీ పొట్ట మొరాయిస్తుందా? ఇలాంటి టైమ్ లో తినకుండా ఉండడానికి లేదా ఇంతర్మిటెంట్ ఫాస్టింగ్ సమయంలో ఆకలి వేయకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇక్కడ చూద్దాం. నీళ్ళు తాగండి: మీకు ఆకలిగా అనిపించిన ప్రతీసారీ మంచినీళ్ళు తాగండి. నీటిలోని కార్బన్ డై ఆక్సైడ్ వల్ల తొందరగా ఆకలి వేయదు. ఆపిల్ సైడర్ వెనిగర్ తాగండి: 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ని కొన్ని నీళ్ళలో పోసుకుని తాగితే మంచిది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి చేయాల్సిన పనులు
చక్కెర లేని గమ్ ని నమలండి: గమ్ ని నమలడం వల్ల ఆకలి వేయదు. కానీ పూర్తిగా నమిలేసిన తర్వాత ఎక్కువ ఆకలి వేస్తుంది. అందుకే ఫాస్టింగ్ చివర్లో మాత్రమే గమ్ ని నమలాలి. మరో విషయం చక్కెర లేని గమ్ ని నమిలితే మంచిది. సరైన నిద్ర: ఫాస్టింగ్ ఉన్న సమయంలో సరిగ్గా నిద్రపోవాలి. కావాల్సినంత సమయం నిద్రలేకపోతే ఆకలి ఎక్కువ అవుతుంది. అందుకే మీ నిద్ర సైకిల్ సరిగ్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. పనుల్లో బిజీ అవ్వండి: ఆకలి అవ్వకూడదంటే ఇతర పనుల్లో బిజీ ఐపోవాలి. పనులున్నప్పుడు కడుపు మీదకు మనసు వెళ్ళదు. అందుకే ఫాస్టింగ్ ఉన్నరోజు, బాగా బిజీగా ఉండండి. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ ముందర వేసుకోండి.