
Nobel Prize 2024 : రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి.. ముగ్గురు శాస్త్రవేత్తలకు గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
2024 రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు.
ప్రొటీన్ల డిజైన్‌పై చేసిన పరిశోధనలకు గాను డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ ఎం. జంపర్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రదానం వైద్య విభాగంలో ప్రారంభమై, అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది.
సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించిన తరువాత, మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఈ రోజు రసాయనశాస్త్రంలో విజేతల జాబితా వెలువడింది.
Details
డిసెంబర్ 10న బహుమతుల ప్రదానం
గురువారం సాహిత్య విభాగానికి సంబంధించి నోబెల్ ప్రకటన ఉండగా, శుక్రవారం శాంతి బహుమతిని ప్రకటించనున్నారు.
అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లు అక్టోబర్ 14న ప్రకటించారు. నోబెల్ బహుమతులు 1901 నుంచి ప్రముఖ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్మరణార్థంగా ప్రారంబించారు.
అవార్డు గ్రహీతలకు 10 లక్షల డాలర్లతో పాటు డిసెంబర్ 10న ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులను ప్రదానం చేయనున్నారు.