5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ
భారతదేశంలో Lenovo Tab P11 5G ప్రారంభమైంది. 6GB/128GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ. 29,999. ఈ టాబ్లెట్ బ్రాండ్ ఇ-స్టోర్ తో పాటు అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. Lenovo బ్రాండ్ కొంతకాలంగా భారతదేశ టాబ్లెట్ మార్కెట్లో తన సత్తా చూపించాలని కృషి చేస్తోంది. ఇప్పుడు భారతదేశంలో టాబ్లెట్ మార్కెట్ షేర్లలో కేవలం 0.14% మాత్రమే ఆ సంస్థకు ఉంది, ఈ మార్కెట్ లో సామ్‌సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ Tab P11 5G లెనోవా కొనుగోలుదారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. Tab P11 5G ఇతర Lenovo టాబ్లెట్‌ల మాదిరి డిజైన్‌తో, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
మార్కెట్లో Realme Pad X, Xiaomi Pad 5లకు పోటీగా దిగుతున్న Lenovo Tab P11
ఈ టాబ్లెట్ లో 13MP వెనుక రియర్ కెమెరాతో పాటు LED ఫ్లాష్ కూడా ఉంది. ముందు భాగంలో, ఫేస్ అన్‌లాక్ కోసం ToF సెన్సార్‌తో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది LPDDR4 RAMతో, ఆండ్రాయిడ్ 11 వెర్షన్ తో వస్తుంది. 20W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,700mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, GPS, టైప్-C పోర్ట్ ఉన్నాయి. 6GB/128GB కాన్ఫిగరేషన్ కు దీని ధర రూ. 29,999, 8GB/256GB కాన్ఫిగరేషన్‌లకు వరుసగా రూ. 34,999. ఈ టాబ్లెట్ Realme Pad X, Xiaomi Pad 5 లకు పోటీగా మార్కెట్లో ప్రవేశిస్తుంది.