
HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర
ఈ వార్తాకథనం ఏంటి
HONOR తన తాజా స్మార్ట్‌ఫోన్ HONOR 80 GTని, కొత్త టాబ్లెట్ Pad V8 Proని విడుదల చేసింది. ఆసియా మార్కెట్లలో Honor జోరందుకుంది. మాతృ సంస్థ నుండి విడిపోయిన తరువాత తన ఖ్యాతిని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది.
HONOR 80 GT టాప్-సెంటర్డ్ పంచ్-హోల్ కట్-అవుట్, స్లిమ్ బెజెల్స్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అమర్చబడి ఉంది. వెనుకవైపు కెమెరా బంప్ తో పాటు, నీలం, తెలుపు, ఇంటర్స్టెల్లార్ నలుపు రంగుల్లో లభ్యం అవుతుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో 16GB వరకు LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ ఉంది.
HONOR
వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో లభ్యం
HONOR Pad V8 Proకు మాములు టాబ్లెట్ డిజైన్‌ను ఉంది, ఎనిమిది స్పీకర్లు, 12.1-అంగుళాల TFT LCD స్క్రీన్, 12GB RAMతో, 256GB స్పేస్ ను అందిస్తుంది. మధ్యతరగతి వినియోగదారులకు అనుకూలమైన ధరలో లభ్యమవుతుంది.
HONOR 80 GT జనవరి 1, 2023 నుండి అందుబాటులో ఉంటుంది. 12GB/256GB, 16GB/256GB వేరియంట్‌లలో వరుసగా CNY 3,299 దాదాపు రూ. 39,200, CNY 3,599 దాదాపు రూ. 42,800 ధరల్లో వస్తుంది.
Pad V8 Pro డిసెంబర్ 30 నుండి అందుబాటులో ఉంటుంది. వరుసగా 8GB/128GB, 8GB/256GB, 62GB/256GB కాన్ఫిగరేషన్లలో CNY 2,599 దాదాపు రూ. 30,880, CNY 2,899 దాదాపు రూ. 34,445, CNY 3,299 దాదాపు రూ. 39,200 ధరల్లో వస్తుంది.