Sunita Williams : 8 రోజుల మిషన్.. 9 నెలల గడువు! సునీతా విలియమ్స్ రాకకు ఆలస్యానికి కారణమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి, ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి బయల్దేరారు. వీరితో పాటు స్పేస్‌ఎక్స్ క్రూ-9లో మరో ఇద్దరు వ్యోమగాములు భూమికి ప్రయాణిస్తున్నారు.
అంతరిక్షంలో 9 నెలలు
2024 జూన్ 5న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బోయింగ్ రూపొందించిన కొత్త స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు.
వాస్తవానికి ఈ మిషన్ 8 రోజుల్లో ముగియాల్సి ఉంది. కానీ క్యాప్సూల్‌లోని థ్రస్టర్స్‌లో టెఫ్లాన్ సీల్స్ దెబ్బతినడంతో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఫలితంగా క్యాప్సూల్ భూమికి తిరిగిరావడం ప్రమాదకరమని నాసా నిర్ణయించింది.
దీంతో వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌లో వదిలేసి, ఖాళీ క్యాప్సూల్‌ను భూమికి పంపారు.
Details
ప్రయోగాల్లో కొత్త రికార్డు సృష్టించిన సునీతా
సునీతా విలియమ్స్ ఐఎస్‌ఎస్‌లో 9 నెలల పాటు అనేక ప్రయోగాలు నిర్వహించారు. పరికరాలను ఫిక్స్ చేసి, సాంకేతిక లోపాలను సరిచేశారు.
62 గంటల పాటు 9 స్పేస్‌వాక్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.
చివరకు స్పేస్‌ఎక్స్‌తో తిరుగు ప్రయాణం
నాసా, బోయింగ్ మిషన్ విఫలమైన నేపథ్యంలో, వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌కి బాధ్యత అప్పగించారు. 2025 మార్చి 14న స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ ఐఎస్‌ఎస్‌కి చేరుకుంది.
ఇప్పుడు క్రూ-9లో ఖాళీగా ఉన్న రెండు సీట్లలో సునీతా, బుచ్ విల్మోర్‌లను భూమికి తీసుకురానున్నారు.
Details
భూమిపైకి వాపసు - ఉత్కంఠత భరితమైన ప్రయాణం!
భారత కాలమానం ప్రకారం మార్చి 18 ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఐఎస్‌ఎస్ నుంచి క్రూ-9 మిషన్ బయల్దేరింది. మార్చి 19 బుధవారం ఉదయం 8:30 గంటలకు ఫ్లోరిడా తీరంలో సముద్రంలో దిగనున్నారు.
ప్రస్తుతం వాతావరణం అనుకూలించాలనే ఉత్కంఠ నెలకొంది.
9 నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్న సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనలో కీలక ఘట్టంగా నిలిచింది.