
WhatsApp: చదవకుండానే తెలుసుకునే ఫీచర్.. వాట్సాప్ కొత్త క్విక్ రీక్యాప్‌పై ఆసక్తి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ముందడుగు వేస్తోంది. తాజా అప్‌డేట్‌లో భాగంగా, వాట్సాప్ మళ్లీ వినూత్న ఏఐ ఆధారిత ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ ముఖ్యంగా చదవని మెసేజ్‌ల (Unseen Messages) సారాంశాన్ని అందించడంలో ప్రత్యేకతను చూపనుంది. ఈ విధంగా యూజర్ల సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా మెటా పని చేస్తోంది.
Details
ఏఐ టెక్నాలజీతో 'క్విక్ రీక్యాప్'
వాబీటాఇన్‌ఫో తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త ఫీచర్ 'Quick Recap' అనే పేరుతో రాబోతోంది. మెటా ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించి, యూజర్లు చదవని మీసేజ్‌లు మెసేజ్‌ల సమగ్ర సారాంశాన్ని తెలుసుకునే అవకాశాన్ని పొందనున్నారు. ఇప్పటికే ఉన్న 'Message Summaries' ఫీచర్‌తో పోలిస్తే ఇది మరింత విస్తృతంగా పనిచేస్తుంది. వాస్తవానికి Message Summaries ఒక్కో చాట్‌కే వర్తించేది. అయితే, Quick Recap ఫీచర్‌తో వినియోగదారులు ఒకేసారి గరిష్ఠంగా ఐదు చాట్‌ల చదవని మెసేజ్‌లను సమ్మరైజ్ చేయగలుగుతారు. దీనివల్ల విస్తృత సంభాషణలను స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండి, మెసేజ్ కంటెంట్‌పై వేగంగా రివ్యూవ్ పొందొచ్చు.
Details
ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే యూజర్లు unread మెసేజ్‌లు ఉన్న చాట్‌లను ఎంపిక చేసి, పైభాగంలో ఉన్న మూడు చుక్కల మెనూ నుంచి 'Quick Recap' ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో చదనవి మెసేజ్‌లకు సంబంధించి ప్రధాన విషయాల సారాంశాన్ని వాట్సాప్ చూపిస్తుంది. ప్రైవసీకి తొలి ప్రాధాన్యత ఈ ఫీచర్ యూజర్ల గోప్యతను పూర్తిగా కాపాడే విధంగా రూపొందించబడింది. మెటా సొంతంగా అభివృద్ధి చేసిన ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా, డేటా ఎప్పటికీ ఎన్‌క్లేవ్ (సురక్షిత వాతావరణం) వెలుపలికి వెళ్లదు. వాట్సాప్ లేదా మెటా ఎవరికీ అసలు మెసేజ్‌లు లేదా అందించిన సారాంశంపై యాక్సెస్ ఉండదు. దీనికి గల కారణం: ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, ఐసోలేటెడ్ కంప్యూటేషన్‌ను వినియోగించడమే.
Details
ప్రస్తుత ప్రగతి, విడుదల సమాచారం
వాట్సాప్ ఈ ఫీచర్‌నుAndroid బీటా వెర్షన్ 2.25.21.12లో టెస్ట్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలోనే ఉంది. కనుక బీటా టెస్టర్‌లకు కూడా ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. రాబోయే అప్‌డేట్లలో బీటా యూజర్లకు మొదటిగా అందుబాటులోకి వచ్చి, అనంతరం అన్ని Android వినియోగదారులకు విడుదల కానుంది. అయితే iOS యాప్‌కు ఇది ఎప్పుడు రానుందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ Quick Recap ఫీచర్ వ్యక్తిగత, గ్రూప్ చాట్‌ల రెండింటినీ కవర్ చేస్తుంది. అయితే, 'అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ' కింద సురక్షితంగా ఉన్న చాట్‌లు మాత్రం దీనికి మినహాయింపుగా ఉంటాయి. అంటే AI ఫీచర్లు ఆ చాట్‌లకు వర్తించవు -వినియోగదారుల ప్రైవసీని గౌరవిస్తూ మెటా తీసుకున్న నిర్ణయం ఇది.