వాట్సప్ లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో స్టిక్కర్ టూల్!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు రోజుకొక కొత్త ఫీచర్ అందిస్తున్నది. తాజాగా మెటా ఆధారిత సంస్థ మరో నూతన ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే వాట్సప్ లో స్టిక్కర్ టూల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో స్టిక్కర్స్ కోసం మరో యాప్ ను వాడాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ iOSలోని అప్లికేషన్లో స్టిక్కర్ లను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టిక్కర్స్ ను వాట్సప్ లోనే తయారు చేసుకొనే అస్కారం ఉంటుంది. ఈ ఆప్షన్ చాట్ లోనే అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని, అయితే ఫీచర్ ఎలా పనిచేస్తుందో దానిపై ఇంకా స్పష్టతను ఇవ్వలేదు.
వాట్సప్ లో లాక్ చాట్ ఫీచర్
యూజర్ తమ గ్యాలరీలోని ఫోటోను తీసుకొని ఎడిట్ చేసుకొనే అవకాశం ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. చాట్ లోని టూల్స్ తో ఫోటో బ్యాక్ గ్రౌండ్ ను పూర్తిగా తొలగించి స్టిక్కర్లు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండటంతో దీనిపై పెద్దగా సమాచారం అందడం లేదు. ఇటీవల లాక్ చాట్ ఫీచర్ ను వాట్సప్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఏదైనా చాట్ ను లాక్ చేస్తే ఆ చాట్ మరో ఫోల్డర్ కు మారిపోతుంది. ఆ ఫోల్డర్ కు పాస్ వర్డ్ తోనే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. సంబంధిత చాట్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే.. ఆ నోటిఫికేషన్ ఆటోమెటిక్ గా హైడ్ అయిపోయింది.