
గగన్‌యాన్‌లో కీలక పురోగతి; మానవ-రేటెడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ఇస్రో ప్రయాణంలో కీలక ముందడుగు పడింది. 240 సెకన్ల ప్రణాళికాబద్ధమైన వ్యవధిలో మానవ-రేటెడ్ ఎల్110-జీ వికాస్ ఇంజిన్ చివరి టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది.
ఈ పరీక్షతో ఇంజిన్‌కు సంబంధించిన ప్రణాళికాబద్ధమైన అర్హత పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తెలిపింది.
తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లో ఈ పరీక్షను నిర్వహించారు.
ఇస్రో
170 కిమీ నుంచి 7 కిమీ ఎత్తులో ప్రొపల్షన్ సిస్టమ్ నియంత్రణ
గగన్‌యాన్ మానవ సహిత ఉపగ్రహ ప్రాజెక్టులో భాగంగా వ్యోవనౌక భూమికి తిరికి వచ్చే క్రమంలో సర్వీస్ మాడ్యూల్‌ను వేరు చేసి, యాక్సిక్ నియంత్రణ అందించే బి ప్రొపెల్లెంట్ ఆధారిత ప్రొపల్షన్ సిస్టమ్ మానవ-రేటెడ్ ఇంజిన్‌లో ఉంటుంది.
అంటే భూమికి రీ ఎంట్రీ సమయంలో పారాచూట్‌ని మోహరించే వరకు 170 కిమీ నుంచి 7 కిమీ ఎత్తులో ప్రొపల్షన్ సిస్టమ్ నియంత్రిస్తుంది.
రీ-ఎంట్రీని ప్రదర్శించడానికి ఈ క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ హాట్ టెస్ట్‌ను నిర్వహించారు. దీనికి ముందు ఆరు థ్రస్టర్‌లతో వరుస పరీక్షలు నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది.