భూమిని తాకిన అయస్కాంత తుఫాను; లద్దాఖ్‌లో అబ్బురపరిచిన అరోరా దృశ్యాలు
లద్దాఖ్‌లో ఏర్పడిన అరోరా దృశ్యాలు అబ్బురపరిచాయి. భూ అయస్కాంత తుఫాను భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అత్యంత అరుదైన అరోరాల ఏర్పడుతాయి. తాజాగా లద్దాఖ్‌లోని సరస్వతి పర్వతంపై ఈ అరుదైన అరోరాను భారతీయ ఖగోళ అబ్జర్వేటరీ కెమెరాలో బంధించింది. అలస్కా, నార్వేతో పాటు ఇతర ఎత్తైన ప్రదేశాల్లో అరోరాస్ సాధారణంగా కనిపిస్తాయి. భారత్‌లో ఇవి చాలా అరుదు అని చెప్పాలి. భారత ఖగోళ అబ్జర్వేటరీ ద్వారా భారతదేశంలో అరోరాను కెమెరాలో బంధించడం ఇదే మొదటిసారి. కేవలం 3000 మీటర్ల ఎత్తులో అంటే ఇంత తక్కువ అక్షాంశంలో అరోరాను చూడటం చాలా అరుదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ చెప్పింది.
2015లో చివరిసారిగా సంభవించిన భూ అయస్కాంత తుఫాను
ఏప్రిల్ 21న సూర్యుని నుంచి కరోనల్ మాస్ ఎజెక్షన్ దెబ్బతినడంతో ఏప్రిల్ 22-23 రాత్రి అరోరాను గుర్తించినట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ వగీష్ మిశ్రా తెలిపారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ గంటకు 21,60,000 కిలోమీటర్ల వేగంతో వచ్చిన భూమిని తాకినట్లు వెల్లడించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ భూమిని తాకడం వల్ల కలిగే ముఖ్యమైన చర్యల్లో ఒకటి భూ అయస్కాంత తుఫాను. ఇలాంటి తీవ్రమైన భూ అయస్కాంత తుఫాను చివరిసారిగా 2015లో సంభవించింది.