Page Loader
ప్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
మే 5 నుంచి ప్లిప్ కార్ట్ సేవింగ్ డేస్

ప్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్ కొత్త ఆఫర్లలతో ముందుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ తో పలు మోడల్స్ పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ వేసవిలో సరికొత్త ఆఫర్లతో సేల్ కు సిద్ధమైంది. ప్లిప్ కార్ట్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో మే 5న ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో కొన్ని మొబైల్స్ పై భారీగా ఆఫర్లు ప్రకటించారు. మోటో జీ62 ధర రూ.14999 గా ఉంది. ఇందులో 6.55 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే, 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 2ఎంపీ మాక్రో సెన్సార్స్​ ఉన్నాయి. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి.

Details

భారీ ఆఫర్లు ప్రకటించిన ఫోన్స్ ఇవే !

రియల్ మీ జీటీనోయో 3టీలో 128జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్-256 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. దీనిధర రూ.19,999 గా ఉంది. ఇందులో స్నాప్​డ్రాగన్​ 870ఎస్​ఓసీ చిప్​సెట్, 6.62ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ స్క్రీన్​ ఉంది. . రెడ్ మీనోట్ 12 ఫ్రో+లో 8జీబీర్యామ్​, 256జీబీస్టోరేజ్​, 12జీబీర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. ఈ మొబైల్ ధర 26, 499 ఉంది. ఇక శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ప్లిప్ 3 ధర రూ.49,999గా ఉంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. ఇంకా యాపిల్‌ ఐఫోన్ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ, గూగుల్ పిక్సెల్‌ 6ఏ వంటి ప్రీమియం ఫోన్లు కూడా ఉన్నాయి.