Page Loader
భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన OPPO Find N2 ఫ్లిప్
ఈ ఫోన్ 8GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది

భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన OPPO Find N2 ఫ్లిప్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 13, 2023
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

OPPO Find N2 ఫ్లిప్ ఇప్పుడు భారతదేశంలో సోలో 8GB/256GB కాన్ఫిగరేషన్ ధరతో రూ.89,999 అందుబాటులోకి రానుంది. ఇది ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్‌లో అతిపెద్ద కవర్ స్క్రీన్‌తో పాటు కొత్త-తరం ఫ్లెక్షన్ హింజ్ తో వస్తుంది. ఇది హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరా సెటప్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ మార్చి 17 నుండి అందుబాటులోకి వస్తుంది. Galaxy Z Flip4 అరంగేట్రం చేసిన నాలుగు నెలల తర్వాత, Find N2 ఫ్లిప్ డిసెంబర్ 2022లో చైనాలో ప్రకటించారు. సామ్ సంగ్ ఫ్లిప్ ఫోన్‌లో మరింత ఉపయోగకరమైన కవర్ స్క్రీన్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఫైండ్ N2 ఫ్లిప్ క్లామ్‌షెల్ డిజైన్‌ ఉంది.

ఫోన్

ఈ ఫోన్ 8GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది

Find N2 ఫ్లిప్ ఒక LED డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆటో ఫోకస్‌తో 32MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది 8GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4,300mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5G, డ్యూయల్ సిమ్‌లు, GPS, NFC, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి. భారతదేశంలో, Find N2 ఫ్లిప్ ధర రూ.89,999, 8GB/256GB కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఫోన్ బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా మార్చి 17 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు 10% తగ్గింపుని (రూ. 5,000 వరకు) పొందచ్చు.