సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం
OPPO ఫిబ్రవరిలో Find X6 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. Find X6 సిరీస్‌లో Find X6 pro మోడల్‌లతో సహా మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. OPPO Find X6 సిరీస్ గురించి గత ఏడాది చివర్లో వార్తలు వినిపించాయి అయితే ఆ తర్వాత Find N2, N2 ఫ్లిప్ మోడల్‌ల వైపు అందరి దృష్టి మారిపోయింది. లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో, Find X6 సిరీస్ సామ్ సంగ్ Galaxy S23 సిరీస్‌కి పోటీగా ఉంటుంది. Find X6 సిరీస్‌లో ఎడమవైపున పంచ్-హోల్ కట్-అవుట్, IR బ్లాస్టర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ సిరీస్ లో కొన్నిటికి Huawei స్మార్ట్‌ఫోన్‌ల లాగానే వెనుక గుండ్రటి కెమెరా బంప్‌ను ఉంటుంది.
OPPO వచ్చే నెలలో Find X6 సిరీస్ ను విడుదల చేయనుంది
ఈ మూడు ఫోన్లకు 120Hz రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్-ఆధారిత ప్రో మోడల్‌కు మాత్రమే LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్ లభిస్తుంది. మిగతా వాటికి LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. X6 4,800mAh బ్యాటరీ వస్తుంది. ఇందులో 32MP సెల్ఫీకెమెరా ఉంటుంది. Find X6లో 50MP (OIS) IMX890 మెయిన్ స్నాపర్, 50MP ISOCELL JN1 అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP IMX763 టెలిఫోటో కెమెరా ఉంటాయి. OPPO వచ్చే నెలలో Find X6 సిరీస్ ను విడుదల చేయనుంది. ఈ సిరీస్ మొదట చైనాలో, తరువాత గ్లోబల్ మార్కెట్ విడుదల అవుతుంది.. లాంచ్ సమయంలో ధర, ఇతర వివరాలు తెలుస్తాయి.