Loading...
ChatGPT Payment Feature: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఇక షాపింగ్‌ నుంచి పేమెంట్స్‌ వరకు అన్నీ అదే చేస్తుంది!
చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఇక షాపింగ్‌ నుంచి పేమెంట్స్‌ వరకు అన్నీ అదే చేస్తుంది!

ChatGPT Payment Feature: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఇక షాపింగ్‌ నుంచి పేమెంట్స్‌ వరకు అన్నీ అదే చేస్తుంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్నాలజీ దిగ్గజం ఓపెన్‌ ఏఐ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఏఐ ఏజెంట్లు యూజర్ల తరఫున నేరుగా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా 'చాట్‌జీపీటీ వాలెట్‌' అనే పేమెంట్‌ ఫీచర్‌ను నవంబర్‌ 13న ప్రకటించినట్లు సమాచారం. వీసా, మాస్టర్‌కార్డ్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రముఖ పేమెంట్‌ నెట్‌వర్క్‌లతో కలిసి ఈ సేవలను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తమ ఏఐ అసిస్టెంట్లకు షాపింగ్‌ బాధ్యతలను అప్పగించవచ్చు.

వివరాలు

ఎలా పనిచేస్తుంది? భద్రత ఎలా ఉంటుంది?

ఈ వ్యవస్థలో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ముందుగా యూజర్లు తమ పేమెంట్‌ కార్డు వివరాలను ఒకసారి చాట్‌జీపీటీ వాలెట్‌లో నమోదు చేయాలి.

ఆ తర్వాత 'డాట్స్‌' (Dots)గా పిలిచే ఏఐ ఏజెంట్లు వినియోగదారుల ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రక్రియను చేపడతాయి.

చెల్లింపు దశకు చేరుకున్నప్పుడు యూజర్‌కు నోటిఫికేషన్‌ వస్తుంది. అందులో కొనుగోలు చేయబోయే వస్తువులు, మొత్తం ధర, చెల్లింపు కోసం ఉపయోగించనున్న కార్డు వివరాలు కనిపిస్తాయి.

వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత యూజర్‌ ఫేస్‌ ఐడీ లేదా వేలిముద్ర వంటి బయోమెట్రిక్‌ భద్రతా పద్ధతుల ద్వారా లావాదేవీకి ఆమోదం తెలపాలి.

వివరాలు

తాత్కాలిక డిజిటల్‌ టోకెన్

యూజర్‌ అనుమతి లభించిన వెంటనే పేమెంట్‌ నెట్‌వర్క్‌ అసలు కార్డు వివరాలకు బదులుగా తాత్కాలిక డిజిటల్‌ టోకెన్‌ను సృష్టిస్తుంది.

ఈ టోకెన్‌ ద్వారానే చెల్లింపు జరుగుతుంది. దీంతో అసలు కార్డు వివరాలు ఏఐ ఏజెంట్‌కు లేదా వ్యాపారికి చేరవని, తద్వారా ఆర్థిక లావాదేవీలకు భద్రత కల్పించవచ్చని కంపెనీ వివరించింది.

ADVERTISEMENT

వివరాలు

ప్రస్తుతం ఎవరికి అందుబాటులో ఉంది?

ప్రస్తుతానికి ఈ సేవలను అమెరికాలోని 18 ఏళ్లు పైబడిన చాట్‌జీపీటీ ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.

వారు తమ పేమెంట్‌ కార్డులను వాలెట్‌కు అనుసంధానం చేసుకోవచ్చు.

ఈ వాలెట్‌ ద్వారా జరిగే కొనుగోళ్లకు సాధారణ కార్డు లావాదేవీల మాదిరిగానే రివార్డ్‌ పాయింట్లు, నాణ్యత లేని వస్తువులకు సంబంధించిన వివాదాల పరిష్కారం వంటి రక్షణలు కూడా వర్తిస్తాయని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసినట్లు కథనం పేర్కొంది.

మోసాలను నివారించేందుకు ప్రత్యేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ఏజెంట్ల ద్వారా జరిగే కొనుగోళ్లను సులభంగా ప్రాసెస్‌ చేసేలా వ్యాపారులకు మార్గదర్శకాలు అందిస్తున్నామని కంపెనీ తెలిపినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లు

భవిష్యత్తులో నిర్దిష్ట ఖర్చు పరిమితులు, వస్తువుల కేటగిరీలు లేదా నిర్ణీత కాల వ్యవధి ఆధారంగా స్వయంచాలకంగా కొనుగోళ్లు జరిపేందుకు ఏఐ ఏజెంట్లకు అనుమతులు ఇచ్చే దిశగా పనిచేస్తున్నట్లు కంపెనీ వివరించింది.

అయితే ఇలాంటి సదుపాయాలకు మరిన్ని భద్రతా ప్రమాణాలు అవసరమని పేర్కొంది.

ప్రస్తుత పరిమిత విడుదల ద్వారా వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించి, వ్యవస్థను మరింత మెరుగుపరచాలని ఓపెన్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

అనంతరం ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నట్లు కథనం వెల్లడించింది.

ADVERTISEMENT