
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఈజీగా పని అయిపోతుంది!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిత్యం సరికొత్త ఫీచర్లను యూజర్ల కోసం పరిచయం చేస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ ఇటీవల కాలంలో తీసుకొస్తున్న కొన్ని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డు గా పిలిచే ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు ఎమోజీ కీబోర్డును పైకి స్క్రోల్ చేయడం కుదురుతుంది.
ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలను ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.12.19 అప్‌డేట్‌తో కొత్త కీబోర్డు అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకున్న కొందరు యూజర్లు ఆ కీబోర్డును యాక్సెస్ చేశారు.
Details
వాట్సాప్ లో రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డు
ఎమోజీల డిస్ ప్లేకు వైడర్ వ్యూ ద్వారా ఒకేసారి చాలా ఎమోజీలు కనిపిస్తాయి. దీంతో మనకు కావాల్సిన ఎమోజీని వెంటనే సెలెక్టు చేసుకొనే అవకాశం ఉంది. ఈ రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డుతో మరొక మార్పును గమనించవచ్చు.
ఎమోజీలు, గిప్ట్స్, స్టిక్కర్స్, అవతార్స్ వంటి ట్యాబ్స్ ను కొత్త ఎమోజీ కీబోర్డులో పైన భాగంలో చేర్చింది. కొంతమంది బీటా టెస్టర్లు మీడియా షేరింగ్, ఎమోజీ కీబోర్డ్ బటన్‌ల కొత్త అరేంజ్‌మెంట్స్ కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది.
ఈ రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డు కేవలం కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే రిలీజ్ అయింది. మిగిలిన యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది.