సౌరకుటుంబ వెలువల కొత్త గ్రహం.. ద్రువీకరించిన ఏఐ
కృతిమ మేధ(ఏఐ) ద్వారా అమెరికా శాస్త్రవేత్తలు నూతన గ్రహాన్ని కనుగొన్నారు. సౌరకుటుంబం వెలువల నూతన గ్రహం ఉందని ఏఐ ధ్రువీకరించింది. గతంతో చేసిన పరిశోధనల్లో ఈ గ్రహం వెలుగు చూడలేదని, ప్రస్తుతం సాంకేతికను జోడించడంతో ఈ గ్రహాన్ని చూశామని ఏఓ తెలిపింది. ప్రస్తుతం మెషీన్ లెర్నింగ్ సాంకేతికను ఉపయోగించడం వల్ల ఈ గ్రహం ఆచూకీ లభించింది. నూతనంగా ఏర్పడ్డ నక్షత్రాల చుట్టూ ధూళి, గ్యాస్ తో కూడా ప్రోటో ప్లానెటరీ వలయాల్లో గ్రహాల ఉనికిని నిర్ధిష్టంగా కనుగొనడానికి ఈ విధానాన్ని వాడొచ్చని నిరూపితమైంది
గ్రహాల అన్వేషణలో కచ్చితత్వం పెరిగింది
గతంలో చూడని అనేక గ్రహాలను ఇప్పుడు గుర్తించడానికి వీలు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిగా గ్రహాల అన్వేషణలో కచ్చితత్వం పెరగడంతో, పరిశోధకుల సమయం కూడా ఆదా కానుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇంకా భవిష్యతులో మరెన్నో అద్భుతాలను సృష్టించడానికి మార్గం సుగమమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మెషిన్ లెర్నింగ్ సాంకేతిక ద్వారా గ్రహాల అన్వేషణకు ప్రస్తుతం కృషి చేసే అవకాశం ఉంది.