
Strawberry Moon: ఆకాశంలో అద్భుత దృశ్యం.. కనవిందు చేయనున్న స్టాబెర్రీ మూన్
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ నెలలో ఆకాశంలో ఓ అద్భుత ఘట్టం జరగబోతోంది.
ఈ బుధవారం (జూన్ 11) తెల్లవారుజామున 3:45 గంటలకు పూర్ణ చంద్రుడు భూమిని తన ప్రకాశంతో మెరిసించనున్నాడు.
ఇది సాధారణ పౌర్ణమి కాదు - ఇది 'స్ట్రాబెర్రీ మూన్'గా ప్రసిద్ధి చెందింది.
స్ట్రాబెర్రీ మూన్.. పేరు వెనక కథ ఇదే!
స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టడం వల్ల చంద్రుడు గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడనుకోవద్దు. అసలైన కారణం అమెరికాలోని స్థానిక తెగల సంప్రదాయాలే.
ముఖ్యంగా అల్గాన్క్విన్ తెగ వారు ఈ జూన్ పౌర్ణమిని స్ట్రాబెర్రీ పంటల కాలంతో అనుసంధానించి, ఈ పేరును నామకరణం చేశారు.
Details
పౌర్ణమి శక్తిని ఉపయోగించుకునే సమయం
ఈ పౌర్ణమి మీ మానసిక భారం, కోపం, ఆవేశాన్ని విడిచిపెట్టడానికి అత్యంత అనుకూల సమయం. ఈ రోజు, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో డైరీతో కూర్చొని, మీ మనస్సు మీకు చెప్పే మాటలు రాయండి.
మీరు పీడిస్తున్న అలవాట్లు, భయాలు, అనుభవాల గురించి ఓపికగా రాసుకోండి.
అవి మీ జీవితంలో ఇకపై ఉండకూడదని నిజాయితీగా భావించి, "నేను దీన్ని నా జీవితం నుండి విడుదల చేస్తున్నానని గట్టిగా పలకండి.
తర్వాత ఆ కాగితాన్ని చింపేయడం లేదా సురక్షితంగా కాల్చేయడం ఆచారానికి బలాన్ని చేకూరుస్తుంది.
Details
చంద్రుని కాంతిని హృదయానికి చేరనివ్వండి
పౌర్ణమి రాత్రి చంద్రకాంతి శరీరంపై పడేలా చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఒక గ్లాసు నీరు, స్ఫటికాలు లేదా ఆభరణాలను కిటికీ లేదా బాల్కనీలో ఉంచండి.
చంద్ర కాంతి వాటిని తాకేలా చూడండి. ఈ నీటిని మీరు మరుసటి ఉదయం త్రాగవచ్చు - ఇది శారీరక, మానసిక స్వచ్ఛతను తీసుకురాగలదని నమ్మకం.
విశ్వానికి చేసిన అర్పణ
అమెరికాలో ఒక ఆసక్తికరమైన ఆచారం ప్రకారం, పౌర్ణమి చంద్రునికి స్ట్రాబెర్రీలను సమర్పించడం జరుగుతుంది. ఇది తీపి, ప్రేమ, హృదయ శక్తికి సంకేతంగా భావించబడుతుంది.
ఒక శుభ్రమైన బట్టపై తాజా స్ట్రాబెర్రీలను చంద్రకాంతిలో ఉంచి, మీ కోరికలు విశ్వానికి అర్పించండి. శుద్ధమైన హృదయంతో కోరుకుంటే అది నెరవేరుతుందన్న నమ్మకం ఉంది.
Details
చంద్ర స్నానం ద్వారా ఆరోగ్య రహస్యం
పౌర్ణమి చంద్రుని కాంతిలో కూర్చొని ధ్యానం చేయడాన్ని "చంద్ర స్నానం" అంటారు.
ఇది శరీరానికి, ఆత్మకు శాంతిని అందిస్తుంది. మీ మేడపై లేదా ఆకాశం కనిపించే ప్రదేశంలో కూర్చొని కనీసం అరగంట పాటు ఈ ప్రక్రియ కొనసాగించండి.
మీరు పొందే శాంతి మీ శరీరం నుంచే కాకుండా ఆత్మను కూడా ప్రభావితం చేస్తుంది.
అనారోగ్యాలను కూడా దూరం చేయగలదని ప్రాచీన నమ్మకాలు చెబుతున్నాయి. ఈ స్ట్రాబెర్రీ మూన్, మీలో కొత్త వెలుగును నింపే అవకాశంగా మార్చండి. మిస్ అవకండి!