Page Loader
Aadhaar Address Update: ఉచితంగా ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్‌ ఫాలో అయితే సరి!
ఉచితంగా ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్‌ ఫాలో అయితే సరి!

Aadhaar Address Update: ఉచితంగా ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్‌ ఫాలో అయితే సరి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆధార్‌ కార్డులో మీ వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? అయితే ఇకపై బయట కేంద్రాలకు వెళ్లే అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన వివరాలను మీరు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సులభంగా సవరించుకోవచ్చు. వాటిలో చిరునామా (అడ్రస్‌) అప్డేట్‌ కూడా ఒకటి. ఈ సేవలను జూన్ 14, 2025 వరకు ఉచితంగా పొందవచ్చు. మరి ఆ ప్రక్రియ ఎలా అంటే..?

వివరాలు 

ఈ విధంగా చేయాలి: 

myAadhaar పోర్టల్‌ను సందర్శించండి - ముందుగా అధికారిక myAadhaar వెబ్‌సైట్‌కి వెళ్లండి. లాగిన్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి - హోమ్‌పేజీలో కనిపించే లాగిన్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. ఆధార్ నంబర్ నమోదు చేయండి - తదుపరి పేజీలో మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. క్యాప్చా కోడ్‌ టైప్‌ చేయండి - చూపిన క్యాప్చా కోడ్‌ను సరైన విధంగా టైప్‌ చేయండి. OTP ద్వారా ప్రామాణీకరణ - మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP)ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. అడ్రస్‌ అప్డేట్‌ ఆప్షన్‌ ఎంచుకోండి - లాగిన్‌ అయిన తరువాత కనిపించే డ్యాష్‌బోర్డులో 'Aadhaar Services' సెక్షన్‌ నుంచి 'Address Update' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.