
ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.
శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.
23.40 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియను శుక్రవారం 12.10 గంటలకు ప్రారంభించగా, కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే సరిగ్గా ఉదయం 11.50 గంటలకు రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది.
సూర్యుడిపై ప్రయోగానికి ఇస్రోకి ఇదే తొలి మిషన్ సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన మొదటి మిషన్ ఆదిత్య L1నే కావడం విశేషం.
DETAILS
పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ మోసుకెళ్లే 7 పేలోడ్లు ఇవే..
దీన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్యుడు - భూమి లాగ్రేంజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.అయితే నిర్ణిత లక్ష్యాన్ని చేరేందుకు దాదాపుగా 125 రోజులు పడుతుంది.
పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ మోసుకెళ్లే 7 పేలోడ్లు ఇవే :
1. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ)
2. సోలార్ అల్ట్రవైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ)
3. సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పెలోడ్
4. హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పెలోడ్
5. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్
6. ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య
7. అడ్వాన్స్ ట్రై -ఆక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్
DETAILS
ఆదిత్య L1 ప్రయోగం కోసం పవర్‌ఫుల్ వేరియంట్ 'XLను వినియోగిస్తున్న ఇస్రో
PSLV-C57 పవర్‌ఫుల్ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఇస్రో పవర్‌ఫుల్ రాకెట్ PSLC-C57ను వినియోగిస్తోంది. పవర్‌ఫుల్ వేరియంట్ 'XLను ఇందుకోసం వాడుతోంది.
ఆదిత్య-ఎల్1 ను తొలుత ఆర్బిట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. అనంతరం ఇది మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి మారుతుంది.ఈ నేపథ్యంలో ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సాయంతో మిషన్ను ఎల్1 పాయింట్‌లోకి ప్రవేశపెడతారు.
గతంలోనూ ఇస్రో XL వేరియంట్‌ను ఉపయోగించింది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1, 2013లో నిర్వహించిన అంగారక ఆర్బిటర్ మిషన్లను XL వేరియంట్, నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఆదిత్య L1 ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థను పర్యవేక్షించవచ్చు. ఫలితంగా సౌర తుఫానులు, అక్కడి వాతావరణ పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'ఆదిత్య ఎల్-1' మిషన్
Indian Space Research Organisation (ISRO) launches solar mission, #AdityaL1 from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/n980WYkbRk
— ANI (@ANI) September 2, 2023