Page Loader
Artificial Intelligence: మీ ఫోన్‌లో ఏఐ సదుపాయాలు.. రోజు పనులు సులభతరం చేయడానికి టాప్ ఫీచర్లు ఇవే!
మీ ఫోన్‌లో ఏఐ సదుపాయాలు.. రోజు పనులు సులభతరం చేయడానికి టాప్ ఫీచర్లు ఇవే!

Artificial Intelligence: మీ ఫోన్‌లో ఏఐ సదుపాయాలు.. రోజు పనులు సులభతరం చేయడానికి టాప్ ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచం లోకాన్ని ఆశ్చర్యపరిచేలా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు తమ పరికరాలలో మరిన్ని ఏఐ ఫీచర్లను చేర్చేందుకు పోటీ పడుతున్నాయి. అయితే నిజానికి మన రోజువారీ పనులను సులభతరం చేసే, పని వేగాన్ని పెంచే ఏఐ ఫీచర్లు ఏవో తెలుసుకుందామా? జనరేటివ్‌ ఫొటో ఎడిటింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏఐ నైపుణ్యాలను చాటిచెప్పటంలో జనరేటివ్‌ ఫొటో ఎడిటింగ్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ఫీచర్‌తో ఫొటోలో అనవసరమైన అంశాలను క్షణాల్లో తొలగించవచ్చు. ఫొటోషాప్‌ మాదిరిగా నైపుణ్యం అవసరం లేకుండా, ఫోన్ స్క్రీన్‌పై కొద్ది టచ్‌లతో ఫొటోల్లో వస్తువుల స్థానాలను మార్చటం, కొత్త అంశాలను చేర్చటం, ఫ్రేమ్‌ విస్తరించటంలాంటి పనులు చేయొచ్చు.

Details

 డాక్యుమెంట్ల సారాంశం 

జెమినీ, ఛాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్లు డాక్యుమెంట్లను త్వరగా విశ్లేషించి సారాంశం అందించటంలో ముందంజలో ఉన్నాయి. పెద్ద ఈమెయిళ్లు, పీడీఎఫ్‌లు, సంక్లిష్ట డాక్యుమెంట్లను చిన్న సంభాషణలోనే వివరించవచ్చు. న్యాయ పత్రాలు, కాంట్రాక్ట్‌లు వంటి వివరాలను సులభంగా అర్థం చేసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగకరం. ప్రత్యక్ష కాల్‌ అనువాదం ఇది స్మార్ట్‌ఫోన్‌లలో అత్యవసరమైన ఏఐ ఫీచర్లలో ఒకటిగా మారింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏఐ వంటి టెక్నాలజీ సాయంతో ఇతర భాషల్లో మాట్లాడే వ్యక్తులతో కూడా ఆన్‌లైన్‌లోనే సులభంగా మాట్లాడవచ్చు. ఈ ఫీచర్‌ ఫోన్‌ కాల్స్‌ కాకుండా, వాట్సప్‌ లేదా టీమ్స్‌ వంటి వాయిస్‌ చాట్‌లలో కూడా ప్రత్యక్ష అనువాదం అందిస్తుంది. విదేశీ పర్యటనల సమయంలో ఇది బాగా ఉపకరిస్తుంది.

Details

 నోటిఫికేషన్స్, ఈమెయిల్స్‌ వర్గీకరణ 

ముఖ్యమైన ఈమెయిళ్లు, నోటిఫికేషన్లను ప్రాధాన్య క్రమంలో వర్గీకరించటానికి ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఐఫోన్‌లోని మెయిల్‌ యాప్‌ ఈమెయిళ్లను వర్గీకరించి, ముఖ్యమైన మెసేజులను ముందుగా చూపుతుంది. యాపిల్‌ ఫోకస్‌ మోడ్‌ అతి ముఖ్యమైన నోటిఫికేషన్లను పిన్‌ చేస్తుంది, పనితీరు మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. రాతకు సహాయం సహజ భాషను అర్థం చేసుకోవటంలో ఏఐ టెక్నాలజీ పెద్ద పురోగతి సాధించింది. చాట్‌జీపీటీ లేదా జెమినీ వంటి మోడళ్లతో ఈమెయిళ్లు రాయడం, డ్రాఫ్ట్‌లు తయారు చేయడం చాలా సులభం. కాలేజీ విద్యార్థులు నోట్స్ రాయటంలో, ఉద్యోగులు అధికారిక డాక్యుమెంట్లను రూపొందించటంలో దీని సాయంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

Details

అధునాతన వాయిస్‌ అసిసెంట్లు

వాయిస్‌ మోడ్‌లు, లైవ్‌ ఫీచర్లతో కూడిన వాయిస్‌ అసిసెంట్లు ఏఐను సజీవంగా వాడుకునే విధంగా సహాయం చేస్తున్నాయి. గూగుల్‌ జెమినీ, సిరి వంటి టూల్స్ సహజ భాషను అర్థం చేసుకుని, సమాచారాన్ని సమకాలీనంగా అందించగలవు. ప్రయాణాలు, అధ్యయనాలకు ఇవి ఎంతో ఉపయోగకరం. ఇమేజ్‌ సృష్టి కేవలం ఫొటోలు ఎడిట్‌ చేయటమే కాదు, ఏఐ సాయంతో ప్రత్యేకమైన ఇమేజ్‌లు, ఎమోజీలను కూడా సృష్టించవచ్చు. పిక్సెల్‌ స్టూడియో, జెన్‌మోజీ వంటి ఫీచర్లు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన సందేశాలను అందించటానికి వీలుపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో ఈ ఏఐ ఫీచర్లు మామూలు పనులను వేగవంతం చేయటమే కాకుండా, వినియోగదారుల జీవితాలను సులభతరం చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.